ఆయుధాల కొనుగోళ్లలో భారత్‌ నం.2 | India's No.2 in the purchase of weapons | Sakshi
Sakshi News home page

ఆయుధాల కొనుగోళ్లలో భారత్‌ నం.2

Dec 28 2016 3:15 AM | Updated on Apr 4 2019 5:04 PM

అమెరికా నుంచి 2008–15 మధ్య కాలంలో భారీగా ఆయుధాలను కొన్న అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది.

వాషింగ్టన్‌: అమెరికా నుంచి 2008–15 మధ్య కాలంలో భారీగా ఆయుధాలను కొన్న అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. 2008–15 మధ్య అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు కోసం భారత్‌ 34 బిలియన్‌ డాలర్లను వెచ్చించింది. ఈ జాబితాలో అమెరికాతో 93.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాల కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకున్న సౌదీ అరేబియా తొలిస్థానం దక్కించుకుంది. కాంగ్రెసనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంప్రదాయక ఆయుధాల బదిలీ, 2008–15’పేరిట తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా ఈ వివరాలు తెలిశాయి.

ఇదే నివేదికలో పొందు పరిచిన మరో జాబితా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2015 ఏడాదిలో ఆయుధాల అంతర్జాతీయ వ్యాపారం అత్యధికంగా చేసిన దేశాల జాబితాలో అమెరికా ప్రథమ స్థానంలో నిలిచింది. 2015లో 40 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా వివిధ దేశాలకు విక్రయించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్‌..అమెరికా అమ్మిన ఆయుధాల్లో సగం కూడా విక్రయించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement