భారత మహిళలకు మరింత స్వేచ్ఛ అవసరం అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉంటున్న భారతీయులు పేర్కొన్నారు.
అబుదాబీ: భారత మహిళలకు మరింత స్వేచ్ఛ అవసరం అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉంటున్న భారతీయులు పేర్కొన్నారు. అక్కడ 69వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్న నేపథ్యంలో వారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆది,సోమవారాల్లో ప్రధాని నరేంద్రమోదీ యూఏఈలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ అంశాన్ని లేవనెత్తడం గమనార్హం.
పితృస్వామ్య పాలనకు భారత్ ఒక సాక్ష్యం అని, అయితే, కొంతమంది మాత్రం మహిళలకు స్వేచ్ఛకావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కేవలం స్వాతంత్ర్యం మాత్రమే కాదని, మహిళల సాధికారతకు, స్వశక్తికి భారత్లో ఎంతో చేయాల్సిన అవసరం చాలా ఉందని గుర్తు చేస్తున్నారని తెలిపారు. ఇక, భారత్లో మహిళలపై నేరాలు తక్కువగా ఉండాలని, వారికి మరింత భద్రత లభించాలని కోరుకుంటున్నామని మరికొందరు మహిళా సభ్యులు కోరారు.