భార్యను కాపాడుతూ మంటల్లో చిక్కుకున్న భర్త..

Indian Man In UAE Suffers 90 Per Cent Burns - Sakshi

దుబాయ్‌ : తమ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం నుంచి భార్యను కాపాడే క్రమంలో భారత్‌కు చెందిన 32 సంవత్సరాల వ్యక్తి దుబాయ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దుబాయ్‌లోని ఉమ్‌అల్‌ క్విన్‌లోని తమ ఫ్లాట్‌లో కేరళకు చెందిన అనిల్‌ నినన్‌, నీను దంపతులు నివసిస్తున్నారు. సోమవారం వారి ఫ్లాట్‌లో మంటలు చెలరేగగా భార్య నీనును రక్షించే క్రమంలో అనిల్‌కు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. స్ధానికులు అనిల్‌ దంపతులను అబుదాబిలోని మఫ్రాక్‌ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

పదిశాతం కాలిన గాయాలైన నీను పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండగా, అనిల్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేరళ దంపతులకు నాలుగేళ్ల కుమారుడున్నాడు. వారి అపార్ట్‌మెంట్‌లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. ప్రమాదం గురించి తమకు పూర్తి వివరాలు తెలియదని, కారిడార్‌లో ఉన్న నీను తొలుత మంటల్లో చిక్కుకోగా, బెడ్‌రూమ్‌లో ఉన్న అనిల్‌ తన భార్యను కాపాడేందుకు పరిగెత్తుకు వచ్చాడని ఈ క్రమంలో మంటలు అతడికి వ్యాపించాయని స్ధానికంగా నివసించే వికార్‌ చెప్పినట్టు ఖలీజ్‌టైమ్స్‌ పత్రిక వెల్లడించింది.

చదవండి : ఇదీ లక్‌ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top