మినీ అణు రియాక్టర్లు అమ్ముతాం! | Indian-American Entrepreneur Offers Fast-Track Mini Nuclear Reactors To India | Sakshi
Sakshi News home page

మినీ అణు రియాక్టర్లు అమ్ముతాం!

Oct 9 2017 4:04 AM | Updated on Apr 4 2019 3:49 PM

Indian-American Entrepreneur Offers Fast-Track Mini Nuclear Reactors To India - Sakshi

వాషింగ్టన్‌: మేకిన్‌ ఇండియాలో భాగంగా భారత్‌లో మినీ ఫాస్ట్‌ట్రాక్‌ అణు రియాక్టర్లను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికాకు చెందిన భారత సంతతి ఔత్సాహిక వ్యాపారవేత్త క్రిస్‌ సింగ్‌ తెలిపారు. 160 మెగావాట్ల సామర్థ్యంతో, లైట్‌ వాటర్‌ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ మినీ రియాక్టర్లు భవిష్యత్‌లో అణు విద్యుత్‌ ఉత్పత్తిలో కీలకంగా మారుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

అమెరికాలోని న్యూజెర్సీలో ఎస్‌ఎంఆర్‌ ఎల్‌ఎల్‌సీ, హోల్‌టెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థల్ని స్థాపించడంతో పాటు సీఈవోగా వ్యవహరిస్తున్న క్రిస్‌ ఈ మేరకు పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘మేం రూపొందించే మినీ రియాక్టర్లకు కొన్ని ఎకరాల స్థలం సరిపోతుంది. సముద్రం, నదీతీరాల్లో, ఎడారుల్లో అమర్చుకోవచ్చు. వీటి ఖర్చు చాలా తక్కువ. ఒక్కో మినీ రియాక్టర్‌ నిర్మాణానికి రూ.65,384 కోట్లు(100 కోట్ల డాలర్లు) మాత్రమే ఖర్చవుతుంది. అంతేకాకుండా ఇవి అత్యంత సురక్షితమైనవి’ అని క్రిస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement