breaking news
Nuclear power generation
-
జాబిలిపై అణువిద్యుత్ సాధ్యమా?
వ్యోమగాములు తమ అంతరిక్ష పరిశో ధనలకు మజిలీగా చందమామను మార్చుకోవాలని భావిస్తున్న తరుణంలో చంద్రునిపై ఏకంగా అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని నాసా భావిస్తోంది. అయితే 2030కల్లా అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎక్కువకాలంపాటు వ్యోమగాములు చంద్రునిపైనే స్థిరనివాసం ఏర్పర్చుకుని జీవించాలన్నా, ఎలాంటి విద్యుత్ అవాంతరాల లేకుండా శాస్త్రసాంకేతిక పరిశోధనలు కొనసా గించాలన్నా అనుక్షణం విద్యుత్ సరఫరా తప్పనిసరి. ప్రాణాధార ఉపకరణాలకూ విద్యుత్ ఖచ్చితంగా అవసరం. అందుకే ఐదేళ్ల లోపే అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేయా లని నాసా భావిస్తోంది. కేంద్రక విచ్చిత్తి (న్యూక్లియర్ ఫిజన్) సూత్రంపై పనిచేసే అణుప్లాంట్‌ను అక్కడ నెలకొల్పనున్నారు. అయితే నాసాకు పోటీగా సొంత అణువిద్యుత్ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చైనా, రష్యాలు సైతం ప్రకటించాయి. మరో పదేళ్లలో ఈ ప్లాంట్లను ఏర్పాటుచేస్తామని ఇప్పటికే వెల్లడించాయి. అణు విద్యుతే ఎందుకు?చందమామపై స్థిరనివాసం ఏర్పర్చుకునే వ్యోమగాముల నిరంతర విద్యుత్ అవసరా లను సౌరవిద్యుత్ ఏమాత్రం తీర్చలేదు. ఎందుకంటే చంద్రునిపై ప్రతిరోజూ సూర్యకాంతి ప్రసారం కాదు. 14 రోజులపాటు ఏకధాటి గా ఎండకాచి తర్వాత 14 రోజులపాటు మైనస్ డిగ్రీ సెల్సియస్ స్థాయిలో చిమ్మచీకటి నెలకొంటుంది. ఈ చీకటిమయ రోజుల్లో విద్యుత్ అవసరాలు తీర్చే ఏకైక ప్రత్యామ్నా యంగా అణువిద్యుత్కేంద్రం నిలుస్తోంది. అందుకే ఎంత ఖర్చయినాసరే వ్యయప్రయా సల కోర్చి చంద్రునిపై న్యూక్లియర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నాసా కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన లకు సైతం పచ్చజెండా ఊపింది. మరో ఐదేళ్లలో అక్కడ అణువిద్యుత్ ప్లాంట్ కలను సాకారంచేయాలని కంకణం కట్టుకుంది. చిన్నస్థాయిలో మొదలెట్టిఅణువిద్యుత్ కేంద్రంలో ఏవైనా ప్రమాదాలు సంభవించినా అక్కడ శూన్యం ఉంటుందికనుక రేడియోధార్మికత అంతటా వ్యాపిస్తుందన్న భయం అక్కర్లేదు. థర్మల్, జల, పవన విద్యుత్‌లతో పోలిస్తే చందమామపై అణువిద్యుత్ మాత్రమే ఆచరణ సాధ్యమవుతుంది. సౌరఫలకాలతో సూర్యకాంతిని ఒడిసిపట్టి సౌర విద్యుత్‌ను తయారుచేసినా అది అక్కడి వ్యోమగాముల అవసరాలను ఏమాత్రం తీర్చలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని న్యూక్లియర్ ప్లాంట్ వైపు శాస్త్రవేత్తలు మొగ్గుచూపుతున్నారు. తొలుత కేవలం 100 కిలోవాట్ల విద్యుత్‌ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నెలకొల్పనున్నారు. భూమి మీద అయితే ఇదే 100 కిలోవాట్ల విద్యుత్‌తో 80 గృహాల విద్యుత్అవసరాలు తీర్చొచ్చు. దశలవారీగా ప్లాంట్‌ను విస్తరించి గణనీయమైన స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తారు.– సాక్షి, నేషనల్ డెస్క్సమస్యలెన్నో...జల, థర్మల్ విద్యుత్ ప్లాంట్లతో పోలిస్తే అణువిద్యుత్ ప్లాంట్‌కు పెద్దగా భూవిస్తీర్ణంతో పనిలేదు. కానీ చంద్రుని మీదకు ఈ మొత్తం అణువిద్యుత్ వ్యవస్థ ఉపకరణాలను మోసుకెళ్లాలంటే చాలా చాలా కష్టం. పైగా ఇవి రాకెట్లో తరలించేంత తేలికగా ఉండాలి. అత్యధిక బరువులను ఇప్పుడున్న రాకెట్లు అస్సలుమోయలేవు. ఒకవేళ అధిక బరువులను మోసుకెళ్లేలా వ్యోమనౌకలను డిజైన్చేసి రూపొందించినా అవి అంత బరువును మోస్తూకూడా జాగ్రత్తగా చంద్రునిపై ల్యాండ్ కావాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చి అది క్రాష్ ల్యాండ్ అయినా వేలకోట్ల రూపాయల నష్టం ఖాయం. భూమిపై అయితే అణువిద్యుత్ కేంద్రాన్ని ఎంతో మంది సాంకేతిక నిపుణులు తీరిగ్గా, నిశితంగా తనిఖీచేసి నిర్మిస్తారు. చంద్రునిపై ఈ ప్లాంట్‌ను నిర్మించాలంటే కార్మిక సిబ్బంది దొరకరు. ఉన్న ఆ కొద్దిపాటి వ్యోమగాములే అణుప్లాంట్ ఉన్నతాధికారుల అవతారమెత్తి ప్లాంట్‌ను బిగించాల్సి ఉంటుంది. అణువిద్యుత్ ప్లాంట్ నుంచి అత్యధిక స్థాయిలో వేడిమి వెలువడుతుంది. దానికి చల్లబరిచే కూలింగ్ వ్యవస్థలను ఏర్పాటుచేయాలి. వాటిని కూడా భూమి మీద నుంచే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో శ్రమ, వ్యయంతో కూడిన వ్యవహారం. శూన్యస్థితిని తట్టుకునేలా వినూత్న రీతిలో ప్లాంట్‌ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. రేడియోధార్మిక వ్యర్థ్యాల పారబోత, ప్లాంట్ పాడైతే రిపేర్లు వంటి ఎన్నో అవరోధాలు అక్కడి హఠాత్తుగా స్వాగతం పలుకుతాయి.వీటిని తట్టుకుంటూనే ప్లాంట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. ట్రంప్ హయాంలో నాసాకు అంతరిక్ష పరిశోధనా బడ్జెట్లో భారీ కోత పెట్టిన నేపథ్యంలో ఇతర మార్గాల్లో ఆదాయం సమకూర్చి ఈ ప్రాజెక్ట్‌ను సఫలీకృతం చేయాల్సి ఉంది. ఇన్ని బాలారిష్టాలను దాటుకుని ప్లాంట్ ఏర్పాటు సుసాధ్యమైతే జాబిలిపై మానవనివాసం ఎలాంటి జంజాటాలు లేకుండా హాయిగా సాగుతుంది. -
భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..?
అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రధానంగా కరెంట్ అవసరాలు కూడా పెరుగుతాయి. ఇండియా 2027 నాటికి దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల ఎనానమీ మార్కును తాకనుందని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు పారిశ్రామిక రంగం ఎంతో చేయూతనందిస్తుంది. అయితే దానికి చాలా విద్యుత్ అవసరం అవుతుంది. దాంతోపాటు దాదాపు అన్ని రంగాల్లో విద్యుత్ ప్రధానపాత్ర పోషిస్తుంది. కానీ దాని తయారీకి ప్రభుత్వాలు, యంత్రాంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుంది. సమర్థంగా కరెంట్ తయారు చేసి వినియోగించేలా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో అణు విద్యుత్‌కే పెద్దపీట వేస్తున్నారు. అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.10 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అణు విద్యుదుత్పత్తిని భారీగా పెంచడమే దీని వెనక ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. అణు విద్యుత్ వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవు. ప్రస్తుతం చూస్తే, దేశీయంగా జరుగుతున్న మొత్తం విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 2% కంటే తక్కువగానే ఉంది. అందుకే తొలిసారిగా ఈ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని చెబుతున్నారు. దేశ విద్యుత్తు ఉత్పత్తిలో సంప్రదాయేతర ఇంధనాల ద్వారా జరుగుతోంది 42% కాగా, దీనిని 2030 కల్లా 50 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ కంపెనీలతో చర్చలు అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల వల్లే ఈ లక్ష్యాలను చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, వేదాంతా, టాటా పవర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిసింది. ఒక్కో సంస్థ సుమారు రూ.44,000 కోట్ల (5.30 బిలియన్ డాలర్లు) వరకు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తుంది. ఏడాదికాలంగా ఈ సంస్థలతో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)లు పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినట్లు వివరించింది. 1.300 మెగావాట్ల సామర్థ్యం పెరిగే అవకాశం.. ప్రస్తుతం దేశంలో 7,500 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్ ప్లాంట్లను ఎన్పీసీఐఎల్ నిర్వహిస్తోంది. మరో 1,300 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు పెట్టాలన్నది ఆ సంస్థ ప్రణాళిక. ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెడితే, 2040 కల్లా 11,000 మెగావాట్ల మేర అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరుతుందని అంచనా. -
మినీ అణు రియాక్టర్లు అమ్ముతాం!
వాషింగ్టన్: మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌లో మినీ ఫాస్ట్‌ట్రాక్ అణు రియాక్టర్లను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికాకు చెందిన భారత సంతతి ఔత్సాహిక వ్యాపారవేత్త క్రిస్ సింగ్ తెలిపారు. 160 మెగావాట్ల సామర్థ్యంతో, లైట్ వాటర్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ మినీ రియాక్టర్లు భవిష్యత్‌లో అణు విద్యుత్ ఉత్పత్తిలో కీలకంగా మారుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఎస్ఎంఆర్ ఎల్ఎల్సీ, హోల్టెక్ ఇంటర్నేషనల్ సంస్థల్ని స్థాపించడంతో పాటు సీఈవోగా వ్యవహరిస్తున్న క్రిస్ ఈ మేరకు పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘మేం రూపొందించే మినీ రియాక్టర్లకు కొన్ని ఎకరాల స్థలం సరిపోతుంది. సముద్రం, నదీతీరాల్లో, ఎడారుల్లో అమర్చుకోవచ్చు. వీటి ఖర్చు చాలా తక్కువ. ఒక్కో మినీ రియాక్టర్ నిర్మాణానికి రూ.65,384 కోట్లు(100 కోట్ల డాలర్లు) మాత్రమే ఖర్చవుతుంది. అంతేకాకుండా ఇవి అత్యంత సురక్షితమైనవి’ అని క్రిస్ తెలిపారు. -
భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం
అణు ఒప్పందంపై ఇరు దేశాల సంతకాలు అణు విద్యుత్ రంగంలో యురేనియం కొరత తగ్గినట్లే రెండేళ్లలో ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు అందనున్న యురేనియం ప్యాకేజీ న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ శుక్రవారం కీలక పౌర అణు ఒప్పందా న్ని కుదుర్చుకున్నాయి. దీనిద్వారా విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న భారత్‌కు అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యురేనియంను ఆస్ట్రేలియా సరఫరా చేయనుంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ శుక్రవారం ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అణు ఒప్పందం సహా నాలుగు ఒప్పందాలపై ఇరుదేశాలూ సంతకాలు చేశాయి. రెండు దేశాల మధ్యా రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరువురు ప్రధానులూ నిర్ణయించారు. మూడో వంతు యురేనియం అక్కడే... ప్రపంచ వ్యాప్తంగా వెలికితీయగల యురేనియం వనరుల్లో మూడో వంతు ఒక్క ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఆ దేశం ఏటా 7,000 టన్నుల యురేనియంను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. అయితే భారత్‌పై యురేనియం ఎగుమతులు చేయటంపై ఆస్ట్రేలియా గతంలో నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని 2012లో తొలగించటంతో తాజాగా అణు ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులూ సంతకాలు చేశారు. అణు శక్తిని శాంతియుత రంగ అవసరాలకు వినియోగించటం లక్ష్యంగా ఈ ఒప్పందం ఖరారైంది. దీని ప్రకారం భారత్‌కు ఆస్ట్రేలియా సుదీర్ఘ కాలం పాటు యురేనియం సరఫరాతోపాటు, రేడియో ఐసోటోప్ల ఉత్పత్తి, అణు భద్రత, ఇతర రంగాల్లో సహకారం కూడా అందించనుంది. రెండేళ్లలో యురేనియం రాక... దేశంలోని అణు విత్యుత్ ప్లాంట్లలో సుమారు 4,680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 2,840 మెగావాట్ల విద్యుత్ దేశీయంగా లభ్యమయే యురేనియంతో ఉత్పత్తి అవుతుండగా.. మిగతా 1,840 మెగావాట్ల విద్యుత్‌ను దిగుమతి చేసుకున్న యురేనియంతో ఉత్పత్తి చేస్తున్నారు. అయితే.. డిమాండ్‌కు తగ్గట్లు యురేనియం సరఫరా లేకపోవటంతో ఈ అణు రియాక్టర్ల నుంచి పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నారు. మరికొన్ని కొత్త అణు విద్యుత్ ప్లాంట్లు నిర్మాణ దిశలో ఉన్నాయి. ఆస్ట్రేలియాతో ఒప్పందం ఫలితంగా యురేనియం కొరత తగ్గిపోనుందని అణు రంగ నిపుణులు చెప్తున్నారు. ఒప్పందం ప్రకారం రెండేళ్లలో ఆస్ట్రేలియా నుంచి తొలి విడత యురేనియం భారత్‌కు అందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంలో భారత్‌కు తిరుగులేని చరిత్ర ఉందని, భారత్ ఆదర్శవంతమైన అంతర్జాతీయ దేశంగా కొనసాగుతోందని అబ్బాట్ ప్రశంసించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం ముంబై చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్.. అక్కడ వ్యాపారవేత్తలు, భారత సీఈఓలతో సమావేశమై వాణిజ్య రంగంలో పరస్పర సహకారంపై చర్చించారు. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. ఈ సందర్భంగా.. రెండు దేశాల మధ్యా అణు ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో కొత్త అధ్యాయానికి దారితీస్తాయని ప్రణబ్ హర్షం వ్యక్తంచేశారు. అనంతరం రాజ్‌ఘాట్, ఇండియాగేట్లను సందర్శించి మహాత్మాగాంధీ, అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత సాయంత్రం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో టోనీ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా.. అణు ఒప్పందంతో పాటు, సాంకేతిక వృత్తి విద్యా శిక్షణ (టీవీఈటీ), జలవనరుల నిర్వహణ, క్రీడా రంగాల్లోనూ మరో మూడు ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. ఈ సమావేశానంతరం ఇరువురు ప్రధానులూ ఒక సంయుక్త ప్రకటన చేశారు. రక్షణ, భద్రత సహకారం బలోపేతం భారత్, ఆస్ట్రేలియా ఇరు దేశాల ప్రజలూ ఉగ్రవాద బాధితులేనని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ పనితీరును ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరువురూ బలమైన ఆకాంక్ష వెలిబుచ్చారు. 2015లో ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాల ప్రారంభానికి జరుగుతున్న ఏర్పాట్లను ఇరువురూ ఆహ్వానించారు. గాలిపోలి వార్షికోత్సవానికి ఆహ్వానం వచ్చే ఏడాది జరగనున్న గాలపోలి శతవార్షికోత్సవానికి హాజరు కావాల్సిందిగా నరేంద్రమోడీని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రధానమంత్రుల తరఫున టోనీ ఆహ్వానించారు. ఆ అల్లర్లకు మోడీని తప్పుపట్టరాదు: టోనీ గుజరాత్లో 2002 నాటి అల్లర్లకు నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీని తప్పుపట్టరాదని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వ్యాఖ్యానించారు. ఆయనపై అనంతమైన దర్యాప్తులు జరిగాయని, అవన్నీ ఆయనను నిర్దోషిగా చెప్పాయని టోనీ పేర్కొన్నారు. హెడ్‌లైన్స్ టుడే వార్తా చానల్లో కరణ్‌థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకున్న మోడీ, అబాట్ ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌లు శుక్రవారం తమ భేటీ సందర్భంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆస్ట్రేలియా ఉన్నితో చేసిన ‘నెహ్రూ జాకెట్’ను మోడీకి అబాట్ బహూకరించగా ప్రతిగా మోడీ... యోగాపై పుస్తకాన్ని అబాట్‌కు బహూకరించారు. కాగా, తమిళనాడులోని ఆలయాల నుంచి గతంలో చోరీకి గురైన విషయం తెలియక తమ దేశ కళా మందిరాలు కొనుగోలు చేసిన రెండు ప్రాచీన దేవతా విగ్రహాలను మోడీకి అబాట్ అప్పగించారు. ఇందుకుగానూ దేశ ప్రజల తరఫున మోడీ అబాట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 11-12వ శతాబ్దం నాటి నటరాజ కాంస్య విగ్రహంతోపాటు అలాగే 10వ శతాబ్దానికి చెందిన అర్ధనారీశ్వర విగ్రహాన్ని అబ్బాట్ మోడీకి అప్పగించారు.