ఆర్‌ఎల్వీ-టీడీ ప్రయోగం విజయవంతం | India Launches First-Ever Indigenous Space Shuttle RLV-TD success | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎల్వీ-టీడీ ప్రయోగం విజయవంతం

May 23 2016 7:30 AM | Updated on Sep 4 2017 12:46 AM

ఆర్‌ఎల్వీ-టీడీ ప్రయోగం విజయవంతం

ఆర్‌ఎల్వీ-టీడీ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది.

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పునర్వినియోగానికి అనువైన ఆర్‌ఎల్వీ-టీడీ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం 7గంటలకు షార్ నుంచి బయల్దేరిన రాకెట్ ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా నింగిలోకి 70 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి విజయవంతంగా భూమిని చేరింది. ఈ ప్రక్రియ మొత్తం 11 నిమిషాల్లోనే ముగిసింది.

అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చ్యువల్ రన్‌వేపై రాకెట్ దిగింది. దీంతో షార్‌లో అప్పటి వరకూ ఉత్కంఠతో ఎదురు చూసిన శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో వ్యోమగాములను రోదసీలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకురావడానికి వీలు పడుతుంది.  భవిష్యత్తులో పూర్తి స్థాయి స్పేస్ షటిల్ రూపొందిస్తామని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement