ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకునేందుకు భారత్-చైనాలు హైదరాబాద్ వేదికగా నవంబర్ తొలి వారంలో చర్చలు జరపనున్నాయి.
భద్రతా సలహాదారుల భేటీ
బీజింగ్: ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకునేందుకు భారత్-చైనాలు హైదరాబాద్ వేదికగా నవంబర్ తొలి వారంలో చర్చలు జరపనున్నాయి. సమావేశానికి ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు హాజరవుతారని ఉన్నతాధికారులు తెలిపారు. భారత్ తరఫున అజిత్ దోవల్, చైనా తరఫున యాంగ్ జైకీ పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
అణు సరఫరాదారుల బృందంలో భారత్‌కు సభ్యత్వం, జైషే మహమ్మద్ చీఫ్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో చైనా అడ్డు పడుతున్న అంశాలు కూడా చర్చకు రానున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో 46 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేస్తున్న చైనా పాక్ ఎకనామిక్ కారిడార్‌ను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పటి వరకూ అంతంతమాత్రంగానే ఉన్నాయి.