సన్నగా ఉంటే.. దీర్ఘాయువు! | Sakshi
Sakshi News home page

సన్నగా ఉంటే.. దీర్ఘాయువు!

Published Sun, Oct 22 2017 5:22 AM

If thinner longevity

నిండు నూరేళ్లూ బతకాలనుకుంటున్నారా? అయితే బరువు పెరగకుండా చూసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండండి అంటున్నారు బ్రిటన్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. దాదాపు 6 లక్షల మంది జన్యు సమాచారంతో పాటు వారి తల్లిదండ్రుల ఆయుర్‌ ప్రమాణాలను విశ్లేషించడం ద్వారా ప్రొఫెసర్‌ జిమ్‌ విల్సన్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాకొచ్చింది.

ప్రతి అదనపు కేజీ బరువుకు ఆయువు 2 నెలల వరకు తగ్గుతుందని.. అలాగే దీర్ఘాయువుకు సంబంధించిన జన్యువులకు జ్ఞాన సముపార్జనకు మధ్య సంబంధమున్నట్లు తమ పరిశోధనల ద్వారా స్పష్టమైందని జిమ్‌ చెబుతున్నారు. కొన్ని రకాల అలవాట్లకు జన్యువులు కారణమని ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో జిమ్‌ బృందం ఆయువును ఎక్కువగా ప్రభావితం చేయగల అలవాట్లను స్పష్టంగా గుర్తించగలిగింది. ధూమపానం, ఊపిరితిత్తుల కేన్సర్‌ లక్షణాలు ఆయువుపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement