వైరల్‌ : కారు తుడిస్తే హగ్‌ ఇచ్చింది.. కానీ

Hugging A Stranger By Mistake Story Gets 31 Million Views - Sakshi

పాశ్చాత్య దేశాల్లో క్రిస్టమస్‌ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. కొత్త బట్టలు ధరించడం, నూతన వస్తువుల కొనుగోలుతోపాటు కొం‍తమంది క్రిస్టమస్‌ హాలిడేస్‌ ఇంకాస్త భిన్నంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. సరదాగా రోడ్లను, పరిసరాలను శుభ్రం చేస్తుంటారు. అపరిచిత వ్యక్తుల కారు అద్దాలను శుభ్రం చేసి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. అయితే, ఫన్నీ స్టోరీలతో అలరించే ఫ్లోరిడాకు చెందిన బ్లాగర్‌ మేరీ క్యాథరిన్‌ బ్యాక్‌స్టోర్మ్‌ మాత్రం ఇలాగే ఆలోచించి పప్పులో కాలేశారు. క్రిస్టమస్‌ పండగ సందర్భంగా షాపింగ్‌లో బిజీబిజీగా ఉన్న ఆమె పొరపాటున ఓ వ్యక్తికి హగ్‌ ఇచ్చారు. 

షాపింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి బయటికొచ్చిన క్యాథరిన్‌ పార్క్‌ చేసి ఉన్న తన కారును చూసి ఒకింత ఆశ్చర్యం.. మరికొంత ఆనందంలో మునిగారు. తన కారు అద్దాలను శుభ్రం చేస్తున్న వ్యక్తిని హగ్‌ చేసుకున్నారు. కానీ, క్షణాల్లో ఆమె తన పొరపాటును గ్రహించారు. ఆ కారును పరిశీలించి చూడగా.. అది తనది కాదని ఆమెకు అర్థం అయింది. వెంటనే నాలుక్కరుచుకుని క్యాథరిన్‌ అక్కడి నుంచి జారుకున్నారు. తనకు ఎదురైన ‘చేదు’అనుభవాన్ని ఆమె ఫేస్‌బుక్‌లో పంచుకోవడంతో అది వైరల్‌ అయింది. ఈ వీడియో 31 మిలియన్ల వ్యూస్‌ సాధించడం విశేషం. ఇక సొంత కారును శుభ్రం చేసుకుంటున్న వ్యక్తికి హగ్‌ ఇవ్వడం.. నవ్వులు పూయిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాగా నవ్వు తెప్పించే సంఘటనల్లో ఇదొకటని అంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top