ఫ్రెండ్‌షిప్‌ డే అలా మొదలైంది..

History And Origin of Friendship Day - Sakshi

ఏ బంధానికైనా స్నేహబంధమే పునాది. దానికి ఎల్లలు ఉండవు. ఎల్లలు లేని స్నేహానికి గుర్తుగా ఒక రోజుని పాటించే సంస్కృతి ఈనాటిది కాదు. అయితే ఒక్కో దేశం ఒక్కో రోజు జరుపుకోవడం విశేషం. నిజానికి స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం 1930లో ఫక్తు మార్కెట్‌ వ్యూహాలతో మొదలైంది. హాల్‌మార్క్‌ గ్రీటింగ్‌ కార్డుల వ్యవస్థాపకుడు జోయస్‌ హాల్‌ ఏటా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. అందుకు తగ్గట్లు కొన్ని గ్రీటింగ్‌ కార్డులు మార్కెట్లోకి పంపారు. కానీ దీని వెనుక స్నేహం కన్నా డబ్బులు సంపాదించే వ్యూహం దాగి ఉందన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 1958లో పరాగ్వేలో వరల్డ్‌ ఫ్రెండ్‌షిప్‌ క్రూసేడ్‌ అనే సంస్థ జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించగా.. క్రమంగా చాలా దేశాలు దీన్ని పాటించడం మొదలుపెట్టాయి. 

దీంతో ఐక్యరాజ్యసమితి 2011లో ఆ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ఇంగ్లిష్‌ రచయిత ఎ.ఎ.మిల్నె సృష్టించిన ‘విన్నీ ది పూహ్‌’కార్టూన్‌ క్యారెక్టర్‌ టెడ్డీబేర్‌ను స్నేహానికి ప్రపంచ స్నేహ రాయబారిగా ఐక్యరాజ్య సమితి అప్పటి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ భార్య నానె అన్నన్‌ 1998లో ప్రకటించారు. అప్పట్నుంచి ఫ్రెండ్‌షిప్‌డే రోజు టెడ్డీబేర్‌లు గిఫ్ట్‌లుగా ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి మొదలైంది. అయితే భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్‌ దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకొంటారు. పాకిస్తాన్‌లో మాత్రం జూలై 30న చేసుకుంటారు. అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జూలై 20న నిర్వహిస్తారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top