అమెరికాలో పెరుగుతున్న హిందూ జనాభా | Hindu population up in US, becomes fourth-largest faith | Sakshi
Sakshi News home page

అమెరికాలో పెరుగుతున్న హిందూ జనాభా

May 13 2015 5:50 PM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో పెరుగుతున్న హిందూ జనాభా - Sakshi

అమెరికాలో పెరుగుతున్న హిందూ జనాభా

భారతదేశం నుంచి వలసలు పెరిగిపోవడం వల్ల అమెరికాలో హిందువుల జానాభా 22 లక్షల 30 వేలకు చేరింది.

న్యూయార్క్: భారతదేశం నుంచి వలసలు పెరిగిపోవడం వల్ల అమెరికాలో హిందువుల జానాభా 22 లక్షల 30 వేలకు పెరిగింది. 2007 నుంచి 2014 నాటికి 85.8 శాతం మంది అంటే  పది లక్షలకు  పెరిగారు. హిందూమతాన్ని విశ్వసించేవారు ఈ దేశంలో నాలుగవ స్థానంలో ఉన్నారు. ప్యూ రిసెర్చ సెంటర్ వివిధ మతస్థులపై జరిపిన విస్తృత అధ్యయనం ప్రకారం అమెరికా జనాభాలో హిందువులు 2007లో 0.4 శాతం ఉండగా, 2014 నాటికి   0.7 శాతానికి పెరిగారు. అంటే ఏడు సంవత్సరాల కాలంలో పది లక్షలకు పైగా పెరిగారు. 2050 నాటికి అమెరికా జనాభాలో హిందువులు 1.2  శాతానికి అంటే 47 లక్షల 80వేలకు  పెరుగుతారని ప్యూ అంచనా.

అమెరికాలో క్రైస్తవుల తరువాత రెండవ స్థానంలో యూదులు, మూడవ స్థానంలో ముస్లింలు, నాలువ స్థానంలో హిందువులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement