వేళకు తింటేనే మేలు | Have to eat in the time | Sakshi
Sakshi News home page

వేళకు తింటేనే మేలు

Jul 22 2017 3:38 AM | Updated on Sep 5 2017 4:34 PM

వేళకు తింటేనే మేలు

వేళకు తింటేనే మేలు

ఒంటి బరువు తగ్గించుకోవాలంటే.. ఎంత తిన్నామన్నది కాదు..

ఒంటి బరువు తగ్గించుకోవాలంటే.. ఎంత తిన్నామన్నది కాదు.. ఎప్పుడు తిన్నామన్నది ముఖ్యం అంటున్నారు యూటీ సౌత్‌వెస్టర్న్‌ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు. బరువు తగ్గించుకునేందుకు మనలో చాలామంది కడుపు కట్టేసుకుంటూ ఉంటారు కదా.. ఇలాంటివాళ్లు ఎంతో కొంత వేళకు తినడం మంచిదని సూచిస్తున్నారు. ఆహారం తక్కువైతే ఆయుష్షు పెరుగుతుందనడానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. కొన్ని ఎలుకలకు అవి చురుగ్గా ఉన్నప్పుడు నిర్ణీత సమయానికి ఆహారం ఇవ్వగా.. మిగిలిన వాటికి అవి విశ్రాంతి తీసుకునే సమయంలో ఇచ్చారు.

రెండు గుంపుల్లోని ఎలుకలకు అందించిన కేలరీలు మాత్రం సమానం. అయితే కొంతకాలం తర్వాత వేళకు తిన్న ఎలుకల బరువు తగ్గగా, మిగిలిన వాటిల్లో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఇంకో ప్రయోగంలో కొన్ని ఎలుకలకు పగలు కావాల్సినంత తిండిపెట్టి.. ఇంకొన్నింటికీ 30 శాతం తక్కువ కేలరీలతో వేళాపాళా లేకుండా ఆహారం అందించారు. ఇక్కడ కూడా సమయానికి తిన్న ఎలుకల బరువు తగ్గగా, వేళాపాళా లేకుండా తిన్న ఎలుకలు మాత్రం బరువెక్కాయి. ఈ ప్రయోగాలను బట్టి.. బరువు తగ్గాలంటే.. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎంత తిన్నామన్నది కాకుండా ఏ సమయంలో తింటున్నామన్నది ముఖ్యమని అర్థమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement