మనవరాలికి జన్మనిచ్చిన అమ్మమ్మ... | Grandmother gives birth to granddaughter Kelcey McKissack | Sakshi
Sakshi News home page

మనవరాలికి జన్మనిచ్చిన అమ్మమ్మ...

Jan 9 2016 12:40 AM | Updated on Sep 3 2017 3:19 PM

మనవరాలికి జన్మనిచ్చిన అమ్మమ్మ...

మనవరాలికి జన్మనిచ్చిన అమ్మమ్మ...

చిన్నారి కెల్సీ మెక్ కిస్సాక్ చాలా అదృష్టవంతురాలు.

టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కూతురి కోసం నవమాసాలు మోసి ఓ బిడ్డకు కని కూతురుకి కానుకగా ఇచ్చింది. చెప్పాలంటే చిన్నారి కెల్సీ మెక్ కిస్సాక్ చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఈ చిన్నారికి జన్మనిచ్చింది ఆమె తల్లి కాదు, అమ్మమ్మ. దాంతో కెల్సీకి అమ్మమ్మ ట్రెసీ థాంప్సన్ అమ్మ అయినట్లయింది. సాధారణంగా తాము అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య అవుతున్నారంటే వారి ఆనందానికి అవధులు ఉండవు.

తన కూతురి నుంచి మనవరాలిని పొందితే ఆనందించాలని ఓ మహిళ భావించింది.  కానీ, కూతురు కెల్లీ మెక్ కిస్సాక్కి కాస్త ఆనారోగ్య కారణాల వల్ల సంతానోత్పత్తి సమస్యలు తలెత్తాయి. కూతురుకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. కెల్లీ, ఆరోన్ దంపతులు చాలా ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సరోగసి విధానమే వారికి ఉన్న చివరి మార్గమని వైద్యులు సూచించారు. ఈ పరిస్థితుల్లో పెద్ద మనసు చేసుకుని అద్దె గర్భానికి అంగీకరించింది. సరోగసి విధానం ద్వారా మనవరాలికి జన్మనిచ్చింది. ఈ జీవితంలో నాకు మా అమ్మ ట్రెసీ థాంప్సన్ చాలా పెద్ద బహుమతి ఇచ్చిందని కెల్లీ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

తనకు తల్లిని అయ్యే అవకాశం లేనిపక్షంలో తన బిడ్డలకు జన్మనివ్వాలని టీజేజ్లో ఉన్నప్పుడు కెల్లీ తన తల్లిని ఆటపట్టిస్తూ ఉండేది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగాలేనందున మా అమ్మ ఇచ్చిన మాట నేర్చుకుందని చెప్పుకొచ్చింది. బుధవారం ట్రేసీ మెక్ కిస్సాక్ మూడున్నర కిలోగ్రాముల ఆరోగ్యకరమైన చిన్నారికి జన్మనిచ్చింది. ఈ విషయాలను ఆ కుటుంబసభ్యులు మీడియాతో పంచుకున్నారు. అనారోగ్య సమస్యలతో పిల్లల్ని నేరుగా కనలేని తల్లిదండ్రులకు సరోగసి విధానం ద్వారా బిడ్డల్ని పొందడం ఉత్తమమని కెల్లీ, ఆరోన్ దంపతులు సహా చిన్నారికి జన్మనిచ్చిన ట్రెసీ థాంప్సన్ అంటున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement