
అనుకున్నదొక్కటి.. అయినది మరొక్కటి.. అంటే ఇదేనేమో! తప్పులో కాలేసిన ఓ బామ్మ చేసిన పనికి అందరూ నోరెళ్లబెట్టారు. కానీ తర్వాత అసలు విషయం తెలిసి సరదాగా నవ్వుకుంటున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన డెబ్భైఆరేళ్ల బామ్మ జానీ టీగూడె ఫిబ్రవరి 11న సామాను తేవడానికని కిరాణా కొట్టుకెళ్లింది. తనకు కావాల్సిన సరుకులు తీసుకుని అనంతరం వాటికి బిల్లు చెల్లించి ఇంటికి తిరిగొచ్చింది. అయితే ఆమె తెచ్చిన ఓ వస్తువును చూసి ఇంటి సభ్యులు షాక్‌కు గురయ్యారు. సామానులో పెద్ద కండోమ్ ప్యాక్ ఉండటంతో వాళ్ల కళ్లను వారే నమ్మలేక గందరగోళానికి లోనయ్యారు. దీనిపై ఆమె భర్త జాన్ రిలే బామ్మను నిలదీయగా తానెక్కడ తీసుకువచ్చానంటూ తిరుగుదాడి చేసింది. (కిటికీలో నుంచి కండోమ్ విసిరాడు)
అనంతరం దాన్ని చూసి అయ్యయ్యో.. ఇది టీ బ్యాగు అని భ్రమపడి పొరపాటున తీసుకువచ్చానే అని నవ్వుతూ సమాధానమిచ్చింది. కొట్టుకు వెళ్లేటపుడు కళ్లజోడు మర్చిపోయానని.. దీంతో తనకు ఏదీ సరిగా కనిపించలేదని సంజాయిషీ ఇచ్చుకుంది. ఇక దీన్ని ఎలాగైనా దుకాణంలో తిరిగి ఇచ్చేసి రమ్మని ఆమె తన మనవరాలిని కోరింది. ఈ విషయాన్నంతటినీ ఫొటోలతో సహా బామ్మ మనవరాలు జెమ్మా తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ‘ఆ బాక్సును చూడగానే మాకు ఆశ్చర్యం వేసింది. దీన్ని ఎలా కొనగలిగావని అడిగితే ఆమె చెప్పిన సమాధానం విని ఎంతో నవ్వుకున్నాం. పైగా ఇది నాకవసరం లేదంటూ.. వెంటనే దుకాణంలో తిరిగి ఇచ్చేసి రమ్మని దబాయిస్తోంది’ అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా బామ్మ చేసిన తప్పిదం ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. (రెస్టారెంట్ కిచెన్‌లో స్నానం: ‘నీకేమైనా పిచ్చా’!)