రాక్షస రూపంలో మేకపిల్ల జననం.. పరుగులు | Goat born with demonic face terrifies locals so badly they call POLICE | Sakshi
Sakshi News home page

రాక్షస రూపంలో మేకపిల్ల జననం.. పరుగులు

Jul 24 2017 9:43 AM | Updated on Sep 27 2018 9:08 PM

రాక్షస రూపంలో మేకపిల్ల జననం.. పరుగులు - Sakshi

రాక్షస రూపంలో మేకపిల్ల జననం.. పరుగులు

వికృత రూపంలో మేకపిల్ల జన్మించడంతో అది చూసిన భయంతో బెంబేలెత్తి పరుగులు తీశారు.

వికృత రూపంలో మేకపిల్ల జన్మించడంతో అది చూసిన జనాలు బెంబేలెత్తి భయంతోపరుగులు తీశారు. దీంతో మేక యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటన మధ్య అర్జెంటీనాలోని శాన్‌లూయిస్‌లో చోటు చేసుకుంది. మేకపిల్ల రెండు కళ్లు అసాధారణంగా లోపలకు కుచించుకుపోయి ఉండటంతో రాక్షస రూపంలా కనిపిస్తోంది. అంతేకాకుండా మేకపిల్ల ముఖంలో కూడా మార్పులు ఉన్నాయి.

అక్కడిచేరుకున్న పోలీసులు భయభ్రాంతులకు గురవుతున్న వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మేకపిల్ల ముఖ భాగం మినహా మిగిలిన శరీరం మొత్తం బాగానే ఉందని చెప్పారు.  పెద్ద ఎత్తున మేకల స్ధావరం దగ్గరకు చేరుకున్న వారిలో ఓ వ్యక్తి మేకపిల్ల ఫోటో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement