బ్యాక్టీరియాతో భూతాపానికి చెక్! | Global warming, a dead zone and surprising bacteria | Sakshi
Sakshi News home page

బ్యాక్టీరియాతో భూతాపానికి చెక్!

Aug 26 2016 12:46 AM | Updated on Sep 4 2017 10:52 AM

భూతాపాన్ని ఎదుర్కోవడంలో అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు విజయం సాధించారు.

భూతాపాన్ని ఎదుర్కోవడంలో అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. జన్యుమార్పిడి చేసిన బ్యాక్టీరియాల సాయంతో వాతావరణంలోని కలుషిత వాయువులను నిరపాయకరమైన ఇంధనంగా మార్చవచ్చని గుర్తించారు. కార్బన్‌డైఆక్సైడ్‌తో పాటు ఇతర గ్రీన్‌హౌజ్ వాయువులను నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ సాయంతో ఒకే దశలో ఇంధనంగా మార్చవచ్చని వీరు చెబుతున్నారు. వాతావరణంలో లభించే ఈ ఎం జైమ్ కారణంగానే నత్రజని.. అమ్మోనియాగా మారి మొక్కలకు ఉపయోగపడుతుంది.

నత్రజని స్థాపన అనే ఈ ప్రక్రియను ఇంధనాల తయారీకి కూడా ఉపయోగించొచ్చని భావించిన శాస్త్రవేత్తలు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. ఆర్.పాలెస్ట్రిస్ అనే బ్యాక్టీరియాలో జన్యుమార్పులు చేసి నైట్రోజినేజ్‌ను అధికంగా ఉత్పత్తి చేసేలా తయారుచేశారు. దీంతో సూర్యరశ్మి సాయంతో ఈ బ్యాక్టీరియా కార్బన్‌డైఆక్సైడ్‌ను వంటగ్యాస్ అయిన మీథేన్‌గా మార్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement