కిమ్‌-ట్రంప్‌ : నాలుగు నిర్ణయాలు

Four Decisions Made In Trump And Kim Jong Un  Meet - Sakshi

సింగపూర్‌ : సంపూర్ణ అణ్వాయుధ నిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక భేటీ ఫలప్రదమైంది. ఇరు దేశాల అధ్యక్షులు ఉమ్మడి తీర్మానంపై సంతకాలు చేశారు.

తీర్మానంలోని ముఖ్యాంశాలు..
- శాంతి సౌభాగ్యాల సాధనలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమెరికా, ఉత్తర కొరియాలు కొత్త సంబంధాలను నెలకొల్పుకుంటాయి.
- కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి స్థాపనకు అమెరికా, ఉత్తర కొరియా కలిసి పని చేస్తాయి.
- 2018 ఏప్రిల్ 27 నాటి పాన్‌ ముంగ్‌ జోమ్‌ తీర్మానానికి అనుగుణంగా సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా కట్టుబడి ఉంటుంది.
- యుద్ధ ఖైదీలను తక్షణమే తిరిగి అప్పగించడం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top