నోబెల్‌ : 55 ఏళ్లలో ఫిజిక్స్‌లో తొలిసారి మహిళకి...

First Woman Physics Nobel Winner In 55 Years - Sakshi

స్టాక్‌హోమ్‌ : 55 ఏళ్లలో తొలిసారి.. భౌతిక శాస్త్రం(ఫిజిక్స్‌)లో నోబెల్‌ పురస్కారాన్ని ఓ మహిళా కూడా అందుకున్నారు. నేడు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ పురస్కారాన్ని లేజర్‌ ఫిజిక్స్‌లో సంచలనాత్మకమైన ఆవిష్కరణలు చేసినందుకు గాను, ఆర్థూర్‌ ఆష్కిన్‌కు, మరో ఇద్దరు శాస్త్రవేత్తలు జెరార్డ్‌ మౌరో, డోన్నా స్క్రిక్లాండ్‌లకు సమిష్టిగా అందజేస్తున్నట్టు ‘ది రాయల్‌ స్వీడిస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ నేడు ప్రకటించింది. 55 ఏళ్లలో తొలిసారి ఈ పురస్కారాన్ని అందుకున్న మహిళ స్క్రిక్లాండ్‌.

మహిళా భౌతిక శాస్త్రవేత్తలందరూ ఎంతో సంబరం చేసుకోవాల్సినవసరం వచ్చిందని, వారిలో నేను ఒకదాన్ని అని స్టాక్‌హోమ్‌లో నోబెల్‌ పురస్కారం ప్రకటన తర్వాత న్యూస్‌ కాన్ఫరెన్స్‌లో స్క్రిక్లాండ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ​ఫిజిక్స్‌లో నోబెల్‌ అవార్డు అందుకున్న మహిళల్లో స్క్రిక్లాండ్‌ మూడో మహిళ. అంతకముందు 1903లో మేరి క్యూరికి, 1963లో మారియ గోపెర్ట్‌ మేయర్‌కు ఈ పురస్కారం దక్కింది. స్క్రిక్లాండ్‌ షేర్‌ చేసుకున్న శాస్త్రవేత్తలో ఆష్కిన్‌ది అమెరికా కాగా, మౌరు ఫ్రెంచ్‌కు చెందిన వారు. ఇక స్క్రిక్లాండ్‌ కెనడియన్‌ మహిళ. వీరు మొత్తం తొమ్మిది మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్‌ అంటే రూ.7,34,33,374ను పొందనున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top