అమెరికా చరిత్రలోనే తొలిసారిగా..

First Openly Gay Man Elected As Colorado Governor In America Midterm Elections - Sakshi

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జారెడ్‌ పోలీస్‌ విజయం సాధించారు. కొలరెడో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్న జారెడ్‌ అమెరికా చరిత్రలో గవర్నర్‌గా ఎంపికైన తొలి స్వలింగ సంపర్కుడిగా చరిత్రకెక్కారు. తనను తాను గే అని ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా ప్రకటించిన జారెడ్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రచారాస్త్రంగా మార్చుకుని విజయం సాధించారు. గతంలోనూ ఐదుసార్లు కాంగ్రెస్‌ ప్రతినిధిగా ఎన్నికైన జారెడ్‌ ఇకపై కొలరెడో గవర్నర్‌గా సేవలు అందించనున్నారు.  కాగా ఓరెగాన్‌ గవర్నర్‌ కేట్‌బ్రౌన్‌ అమెరికా తొలి బైసెక్సువల్‌ గవర్నర్‌గా గుర్తింపు పొందగా.. న్యూజెర్సీ మాజీ గవర్నర్‌ జిమ్‌ మెక్‌గ్రీవీ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను గేనని ప్రకటించుకున్నారు.

పేరు మార్చుకుని..
యూదు అయిన జారెడ్‌ అసలు పేరు జారెడ్‌ చుల్జ్‌. తన బామ్మ ఙ్ఞాపకార్థం 25 ఏట తన పేరును జారెడ్‌ పోలీసుగా మార్చుకున్నారు. కాలేజీ రోజుల నాటి నుంచే రాజకీయాల్లో రాణించాలనే ఆశయం ఉన్న జారెడ్‌ మొదట వ్యాపారవేత్తగా ఎదిగి... ఆ తర్వాత డెమొక్రటిక్‌ పార్టీలో చేరి తన కలను సాకారం చేసుకున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top