అమ్మో! ఆ మహిళా ఉగ్రవాదికి ఎన్ని చెడు అలవాట్లో.. | female suicide bomber shows the jihadi who never read the Koran | Sakshi
Sakshi News home page

అమ్మో! ఆ మహిళా ఉగ్రవాదికి ఎన్ని చెడు అలవాట్లో..

Nov 20 2015 5:01 PM | Updated on Oct 5 2018 9:09 PM

అమ్మో! ఆ మహిళా ఉగ్రవాదికి ఎన్ని చెడు అలవాట్లో.. - Sakshi

అమ్మో! ఆ మహిళా ఉగ్రవాదికి ఎన్ని చెడు అలవాట్లో..

ఒక అమ్మాయికి ఎలాంటి లక్షణాలు, అలవాట్లు ఉండకూడదో అవన్నీ కూడా పారిస్‌లో గత శుక్రవారం నరమేధం సృష్టించిన ఉగ్రవాద దాడిలో తనను తాను పేల్చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళా ఉగ్రవాది హస్నా ఐతబౌలాచ్న్కి ఉన్నట్లు ఆమె సోదరుడు తెలిపాడు.

పారిస్: ఒక అమ్మాయికి ఎలాంటి లక్షణాలు, అలవాట్లు ఉండకూడదో అవన్నీ ఆమెకు ఉన్నాయి. ఇంతకీ ఆ మహిళ ఎవరో తెలుసా? పారిస్‌లో గత శుక్రవారం నరమేధం సృష్టించిన ఉగ్రవాద దాడిలో తనను తాను పేల్చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళా ఉగ్రవాది హస్నా ఐతబౌలాచ్న్కి ఉన్నట్లు ఆమె సోదరుడు తెలిపాడు. ఆమెకు సంబంధించిన కొన్ని వ్యక్తి గత అంశాలను అతడు తెలియజేయడంతోపాటు కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.

ఆమె ఫుల్లుగా తాగుతుందని, దమ్ముకొడుతూ అవారాగా తిరిగేదని, చాలామంది అబ్బాయిలతో సహవాసం చేసేదని,  కనీసం ఒక్కసారి కూడా తమ పవిత్ర గ్రంథం ఖురాన్ పఠించలేదని అతడు మీడియాకు వెల్లడించాడు. పారిస్ నగర శివార్లలోని సెయింట్ డెనిస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో అబిదెల్ అనే ఉగ్రదాడి దాక్కున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడి చేయటం.. ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపటంతో ఏడు గంటల పాటు ఆపరేషన్ కొనసాగటం తెలిసిందే.

ఈ ఆపరేషన్‌లో హస్నా ఐతబౌలాచ్న్ బాంబులతో కూడిన జాకెట్‌తో తనను తాను పేల్చివేసుకుంది. దీంతో అసలు ఆమె ఎందుకు ఉగ్రవాదిగా మారింది, ఆమెకు వ్యక్తిగత అలవాట్లు ఏమిటనే విషయంపై మీడియా వర్గాలు  ఆరా తీయగా కొన్ని అంశాలు ఆమె సోదరుడి ద్వారా తెలిశాయి. ఎప్పుడూ జల్సాగా తిరుగుతూ పార్టీలు, పబ్లు అంటూ గడుపుతూ ఇంట్లో ఎవరి మాట కూడా వినేది కాదట.

మతాల పట్ల విశ్వాసం ఇసుమంతైనా కూడా ఆమెకు లేదని తెలిసింది. సెయింట్ డెనిస్ లో పోలీసులు అపార్ట్‌మెంటును చుట్టుముట్టగానే తొలుత కాల్పులు ప్రారంభించింది ఆమేనని.. ఆ వెంటనే తనను తాను పేల్చివేసుకునే ముందు నాకు సాయం చేయండి అంటూ కేకలు వేయటం ద్వారా పోలీసులను తన దగ్గరకు రప్పించుకుని, తనతో పాటు పేల్చివేయాలనే ప్రయత్నం చేసిందని కూడా పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement