భారీ ఉడుమును భలే ఈడ్చిపారేసింది | Fearless Waitress Drags Giant Lizard Out Of Restaurant | Sakshi
Sakshi News home page

భారీ ఉడుమును భలే ఈడ్చిపారేసింది

Feb 22 2017 6:47 PM | Updated on Sep 5 2017 4:21 AM

భారీ ఉడుమును భలే ఈడ్చిపారేసింది

భారీ ఉడుమును భలే ఈడ్చిపారేసింది

చిన్న బొద్దింకను చూస్తేనే అమ్మాయిలు బాబోయ్‌ అంటూ అమ్మాయిలు ఎగిరిగంతేస్తారు.. అలాంటిది అచ్చం ఓ చిన్నసైజు గాడ్జిల్లాలాంటి ఉడుమును చూస్తే పరిస్థితి ఏమిటి? ఊహించుకుంటేనే ఉలిక్కిపడేట్టు ఉంది కదా!

న్యూసౌత్‌వేల్స్‌: చిన్న బొద్దింకను చూస్తేనే అమ్మాయిలు బాబోయ్‌ అంటూ అమ్మాయిలు ఎగిరిగంతేస్తారు.. అలాంటిది అచ్చం ఓ చిన్నసైజు గాడ్జిల్లాలాంటి ఉడుమును చూస్తే పరిస్థితి ఏమిటి? ఊహించుకుంటేనే ఉలిక్కిపడేట్టు ఉంది కదా! కానీ, ఓ అమ్మాయి ఆ ఉడుమును చూడటమే కాదు దాని తోకపట్టుకొని ఈడ్చి పారేసింది. తన రెస్టారెంటులో అడుగుపెట్టడానికి నీకెన్ని గుండెలు అన్నట్లుగా ఆ ఉడుమును అవలీలగా అదేదో కొబ్బరిమట్టను ఈడ్చుకెళ్లి బయటపడేసినట్లు విసిరేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని రెస్టారెంట్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఫేసబుక్‌లో హల్ చల్‌ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. సామియా లిలా(25) అనే యువతి న్యూసైత్‌ వేల్స్‌లోని మిమోసా వైన్స్‌ అండ్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తోంది. ఆ రెస్టారెంటులోకి అత్యంత అరుదైన రకానికి చెందిన భారీ ఉడుము వచ్చి అక్కడ ఉన్నవారిని హడలెత్తించింది. చాలామంది కేకలు పెట్టి భయంతో పరుగులు పెట్టేట్లు చేసినా ఆ యువతి మాత్రం దానిని చాలా సింపుల్‌గా తీసుకొని తోకపట్టి ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లింది. అది తిరగబడే ప్రయత్నం చేసినా ఎంతో నైపుణ్యంతో చాకచక్యంగా పట్టుకొని బయటకు పడేసి కస్టమర్లు అవాక్కయ్యేలా చేసింది. ఇలా ఎలా చేయగలిగావని ప్రశ్నించిన వాళ్లకు అలాంటి జంతువులంటే తనకు చాలా ఇష్టం అని, అందుకే దానిని పట్టుకోగలిగానని చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement