
శాన్‌ఫ్రాన్సిస్కో: ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌ల పేర్లు రానున్న కాలంలో మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాటి మాతృసంస్థ, సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కసరత్తులు చేస్తోంది. ఆండ్రాయిడ్, యాపిల్ స్టోర్లలో ఇన్‌స్టాగ్రామ్ పేరు ‘ఇన్‌స్టాగ్రామ్ ఫ్రమ్ ఫేస్‌బుక్’, వాట్సాప్ పేరు ‘వాట్పాప్ ఫ్రమ్ ఫేస్‌బుక్’గా మారే అవకాశం కనిపిస్తోంది. మెసేజింగ్ అప్లికేషన్లను ఏకీకృతం (మెర్జ్) చేయడంతోపాటు పాటు, ఈ సేవలన్నీ ఫేస్‌బుక్ నుంచే వస్తున్నాయన్న విషయాన్ని వినియోగదారులు గుర్తించేలా ఈ మార్పులకు శ్రీకారం చుట్టామని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ విషయం తమ ఉద్యోగులకు ఇప్పటికే వివరించినట్లు తెలిపారు. ఇతర సోషల్‌మీడియా వేదికల నుంచి వస్తున్న గట్టి పోటీ మేరకే ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంటోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొది.