
గురుద్వారాలో బాంబు పేలుడు
జర్మనీలోని పశ్చిమ ఎస్సెన్లో ఉన్న సిక్కుల దేవాలయం గురుద్వారాలో పేలుడు చోటుచేసుకుంది.
బెర్లిన్: సిక్కుల దేవాలయం గురుద్వారాలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ సంఘటన జర్మనీలో పశ్చిమ ఎస్సెన్లోని గురుద్వారాలో జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురికి గాయాలయినట్టు పోలీసులు తెలిపారు.
సంఘటన అనంతరం మాస్క్ ధరించిన ఓ దుండగుడు అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. గాయాలైన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తీవ్రవాద చర్యగా భావించడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు అంటున్నారు.
అయితే అక్కడ కొద్దిసేపటి ముందే వివాహ వేడుక జరిగిందని, క్షతగాత్రులు కూడా ఆ కార్యక్రమానికి హాజరైన అతిథులుగా పోలీసులు భావిస్తున్నారు.