
జకార్తా : ఇండోనేసియాలో గురువారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జకార్తా సమీపంలోని తంగెరాంగ్ లోని ఓ బాణా సంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 47 మంది మృతి చెందినట్లు సమాచారం.
కర్మాగారంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి, మంటలు మొత్తం చుట్టుపక్కల త్వరగతిన వ్యాపించాయి. దీంతో తప్పించుకునే వీలు లేకుండా పోయింది. మరణించిన వారి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతంగా కాలిపోయాయని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో మరో 43 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడుతో దాని పక్క ఉన్న ఫ్యాక్టరీ కూడా సగం వరకు కూలిపోగా, పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కాగా, ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.