బంగారు దేశం!

Ethiopia could be sitting on one of world's great untapped gold deposits - Sakshi

ప్రపంచంలోని పుత్తడిలో అత్యధిక భాగం ఇథియోపియాలోనే...

ఆఫ్రికా దేశం ఇథియోపియా అంటే కేవలం పేదరికం, యుద్ధాలు, అంతర్యుద్ధాలే గుర్తొస్తాయి. కానీ ప్రపంచంలోనే మరే దేశంలోనూ లేనంత బంగారం ఈ దేశ భూగర్భంలో ఉండొచ్చని శాస్త్రవేత్తలు తాజాగా చెబుతున్నారు.ఈ స్వర్ణ లోహాన్నంతటినీ వెలికి తీయడం ప్రారంభిస్తే బంగారం ఉత్పత్తిలో ఇథియోపియా దక్షిణాఫ్రికాను కూడా వెనక్కి నెట్టే అవకాశం ఉంటుందన్నారు. స్కాట్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ అబెర్దీన్‌కు చెందిన లియామ్‌ బుల్లాక్, ఒవెన్‌ మోర్గాన్‌ అనే ఇద్దరు భూగర్భ శాస్త్రజ్ఞులు ఇథియోపియాలో పరిశోధనలు సాగించారు. ఇథియోపియా పశ్చిమ భాగాన, సూడాన్‌ సరిహద్దుకు దగ్గర్లో అసోసా అనే ప్రాంతం ఉంటుంది. మైదానాలు, పర్వత ప్రాంతాలు, లోయలు, నదీ ప్రవాహాలతో కలగలసి ఉండే ఇథియోపియాలో దట్టమైన అడవులూ బాగా ఎక్కువే.

1930 నుంచి 1974 వరకు ఇథియోపియా చక్రవర్తిగా ఉన్న హైలీ సెలాస్సీ అసోసాలో బంగారాన్ని వెలికి తీయడంపై శ్రద్ధ చూపారు. అనంతరం అంతర్యుద్ధం తదితర కారణాలతో బంగారు గనుల తవ్వకాల గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ 2000 తర్వాత ప్రభుత్వం గనుల తవ్వకాలకు లైసెన్సులు ఇవ్వడం ప్రారంభించింది. తులు కపి అనే ప్రాంతం నుంచి ఇప్పటికే 48 టన్నుల బంగారాన్ని బయటకు తీశారు. అసోసా ప్రాంతంలోనూ 48 టన్నుల బంగారమే ఉందని ఈజిప్టుకు చెందిన ఆస్కామ్‌ అనే కంపెనీ గుర్తించింది. వాస్తవానికి ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top