పాకిస్థాన్లోని వాయవ్య ఖైబర్ గిరిజన ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని వాయవ్య ఖైబర్ గిరిజన ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం రాత్రి ఈ సంఘటనలో ఇద్దరు సైనికులు కూడా చనిపోయినట్టు ఓ భద్రతాధికారి చెప్పారు. మరో ముగ్గురు సైనికులు గాయపడినట్టు తెలిపారు. కాగా పాక్లో శనివారం మూడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆరుగురు సైనికులు, ఓ పౌరుడు మరణించారు. దేశ రాజధానిలోనే రెండు పేలుళ్లు జరిగాయి.