ఫ్రాన్స్ లో గురువారం భూకంపం సంభవించింది.
పారిస్: ఫ్రాన్స్ లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూప్రకంపనల తీవ్రత 5.2గా నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్రాన్స్ లోని లా రోచెల్ నగరంలో, సమీప ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. 2014 తర్వాత ఫ్రాన్స్ దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద భూకంపం ఇదేనని సెంట్రల్ ఫ్రెంచ్ అధికారులు వెల్లడించారు. ఎంతమేరకు నష్టం వాటిల్లిందన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.