ప్యాంటులో పేలిన ఈ-సిగరెట్ | e-cigaratte explodes in pants, man rushed to hospital | Sakshi
Sakshi News home page

ప్యాంటులో పేలిన ఈ-సిగరెట్

Nov 24 2016 3:38 PM | Updated on Oct 17 2018 4:54 PM

ప్యాంటులో పేలిన ఈ-సిగరెట్ - Sakshi

ప్యాంటులో పేలిన ఈ-సిగరెట్

న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రాంతంలో షాపింగ్ చేస్తున్న ఓ వ్యక్తి ప్యాంటులో ఉన్న ఈ-సిగరెట్ పేలింది.

సిగరెట్లు కాల్చే అలవాటు మానుకోవాలంటే ముందుగా ఈ-సిగరెట్లు అలవాటు చేసుకుంటారు కొంతమంది. ఇవి అంతగా ప్రమాదకరం కాకపోవడం, దుష్ప్రభావాలు లేకపోవడంతో పాటు.. దాదాపుగా సిగరెట్ తాగినంత మజా వస్తుందని చాలామంది అంటుంటారు. కానీ.. న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రాంతంలో షాపింగ్ చేస్తున్న ఓ వ్యక్తి ప్యాంటులో ఉన్న ఈ-సిగరెట్ పేలింది. దాంతో అతడి కాలికి, చేతికి గాయాలయ్యాయి. ఉన్నట్టుండి ఏదో బాణసంచా కాల్పుల్లా తనకు అనిపించిందని, తీరా చూస్తే ఒక వ్యక్తి ప్యాంటులోంచి మంటలు రావడం చూశానని సెంట్రల్ సెల్లార్స్ ఉద్యోగి జాన్ లీ చెప్పారు. 
Advertisement
 
Advertisement
Advertisement