ట్రంప్‌ టవర్‌కు ఫుల్‌ క్రేజ్‌ | Donald Trump's Trump Tower, Becomes NYC's Hottest Backdrop | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ టవర్‌కు ఫుల్‌ క్రేజ్‌

Nov 20 2016 9:23 AM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్‌ టవర్‌కు ఫుల్‌ క్రేజ్‌ - Sakshi

ట్రంప్‌ టవర్‌కు ఫుల్‌ క్రేజ్‌

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ కు సంబంధించిన నివాసం, వ్యాపార సముదాయం ట్రంప్‌ టవర్‌కు ఫుల్‌ క్రేజ్‌ పెరిగిపోతోంది.

న్యూయార్క్‌: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ కు సంబంధించిన నివాసం, వ్యాపార సముదాయం ట్రంప్‌ టవర్‌కు ఫుల్‌ క్రేజ్‌ పెరిగిపోతోంది. టూరిస్టు ప్రాంతాలకంటే ఆ టవర్‌ ముందే ఇటు స్వదేశీయులతోపాటు విదేశీయులు కూడా క్యూ కడుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో స్వీయ చిత్రాలు(సెల్ఫీలు) అంటే ఎంతటి మోజు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు వినూత్నంగా సెల్ఫీలు దిగడం పరిపాటే.

ఆ అలవాటులో భాగంగానే ఇప్పుడు న్యూయార్క్‌ లో ప్రతి ఒక్కరు ట్రంప్‌ టవర్‌ ముందు నిల్చుని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఎంతలా అంటే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులకు ఇక చాలు వెళ్లండి అని రోజంతా చెప్పలేక విసుగొచ్చేస్తుందంట. అంతేకాదు వీరికి అదనంగా తాజాగా పోలీసులు కూడా అక్కడ పెద్ద మొత్తంలో భద్రత నిమిత్తం చేరి ఆంక్షలు పెడుతున్నప్పటికీ సెల్ఫీలు మాత్రం ఆపడం లేదంట. ఎన్నికల నిర్వహణ తేది ప్రకటించినప్పటి నుంచి ఈ తంతు మొదలైందని, ఇప్పుడు ట్రంప్‌ విజయం సాధించడంతో అది కాస్త మరింత ఎక్కువై ఈ మధ్య సిమెంట్‌ మెటల్‌ రెయిలింగ్‌ కూడా ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement