ట్రావెల్ బ్యాన్‌కు కొత్త ఆర్డర్: ట్రంప్
ఏడు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ కోసం తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను వచ్చే వారంలోగా ప్రవేశపెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
వాషింగ్టన్: ఏడు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ కోసం తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను వచ్చే వారంలోగా ప్రవేశపెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ మొదట ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై యూఎస్ కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. కోర్టు ఇచ్చిన స్టేపై మాట్లాడిన ఆయన అంతిమంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాకపోతే కొద్దిగా సమయం పడుతుందని అన్నారు. అదీ కాకపోతే చాలా రకాల ఆప్షన్లు తన చేతిలో ఉన్నాయని చెప్పారు. నిషేధానికి మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం పెడతానని చెప్పారు. ఫ్లోరిడాకు విమానంలో వెళ్తున్న ట్రంప్‌ను రిపోర్టర్లు ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు.
దేశానికి భద్రత చాలా అవసరమని చెప్పారు. తొమ్మిదో యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆర్డర్ల వల్ల వచ్చే వారం వరకూ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఇవ్వలేమని చెప్పారు. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఇమిగ్రేషన్ కు సంబంధించి కొత్త భద్రతా నిబంధనలు ఉండే అవకాశం ఉంది. గత నెలలో ఏడు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను పాస్ చేసిన విషయం తెలిసిందే.