కుక్కా.. స్టైలు బాగుందే .. | dogs walking event | Sakshi
Sakshi News home page

కుక్కా.. స్టైలు బాగుందే ..

Sep 2 2014 2:55 AM | Updated on Sep 29 2018 4:26 PM

కుక్కా.. స్టైలు బాగుందే .. - Sakshi

కుక్కా.. స్టైలు బాగుందే ..

కుక్కలు పిల్లి నడకలు నడిస్తే ఎలాగుంటుంది? ఏటా న్యూయార్క్‌లో నిర్వహించే డాగీస్ అండ్ టయారాస్ పోటీకి వెళ్తే.. మనకా విషయం తెలుస్తుంది.

కుక్కలు పిల్లి నడకలు నడిస్తే ఎలాగుంటుంది? ఏటా న్యూయార్క్‌లో నిర్వహించే డాగీస్ అండ్ టయారాస్ పోటీకి వెళ్తే.. మనకా విషయం తెలుస్తుంది. ఈ బుల్లి కుక్కల అందాల పోటీలో యాక్టివ్ వేర్, టాలెంట్, ఈవెనింగ్ వేర్ వంటి విభాగాలుంటాయి. ఆయా విభాగాల్లో వచ్చే మార్కుల ఆధారంగా విజేతను ప్రకటిస్తారు.
 
గౌన్లు, ఫ్రాకులు వంటి వివిధ డ్రస్సులేసుకుని బుల్లి కుక్కలు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తుంటే.. చూడముచ్చటగా ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే శునకాల యజమానులు ఎంట్రీ ఫీజు కింద రూ.4,500 చెల్లించాలి. ఈ పోటీల ద్వారా వచ్చే డబ్బును వీధి కుక్కల సంక్షేమానికి ఉపయోగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement