పెంపుడు కుక్క పిల్లకూ కోవిడ్‌ వైరస్‌ | Dog in Hong Kong Tests Positive of Coronavirus | Sakshi
Sakshi News home page

పెంపుడు కుక్క పిల్లకూ కోవిడ్‌ వైరస్‌

Feb 28 2020 7:18 PM | Updated on Feb 28 2020 7:19 PM

Dog in Hong Kong Tests Positive of Coronavirus - Sakshi

ఈ వార్త తెల్సిన వెంటనే హాంకాంగ్‌లో పలువురు తమ కుక్క పిల్లలకు కూడా ముందు జాగ్రత్తగా ముక్కుకు, నోటికి మాస్కులు తగిలిస్తున్నారు.

న్యూఢిల్లీ : హాంకాంగ్‌లో నివసిస్తున్న యువన్నె చెవ్‌ హౌ యీ అనే వృద్ధురాలితోపాటు ఆమె పెంచుకుంటున్న పొమరేనియన్‌ జాతికి చెందిన కుక్క పిల్లకు కూడా కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) సోకిందని తేలింది. హాంకాంగ్‌లో జుహాయ్‌ మకావో వంతెనకు సమీపంలో నివసిస్తున్న యువన్నె చెవ్‌కు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమెకు కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమెను అదే రోజు సమీపంలోని నిర్భంద వైద్య శిబిరానికి తరలించారు. ఆ మరుసటి రోజు బుధవారం నాడు వైద్య అధికారులు వచ్చి ఆమె ఇంట్లో పెంచుకుంటున్న కుక్క పిల్లను తీసుకొని పోయి పరీక్షలు నిర్వహించారు. దానికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అవడంతో కుక్క పిల్లను కూడా 14 రోజులపాటు నిర్భంద వైద్య శిబిరానికి తరలించారు.



ఈ వార్త తెల్సిన వెంటనే హాంకాంగ్‌లో పలువురు తమ కుక్క పిల్లలకు కూడా ముందు జాగ్రత్తగా ముక్కుకు, నోటికి మాస్కులు తగిలిస్తున్నారు. కోవిడ్‌ సోకిన కుక్క పిల్లల నుంచి తిరిగి మనుషులకు వైరస్‌ సోకుతుందనడానికి తమ వద్ద ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవని వైద్యాధికారులు తెలియజేశారు. అయితే ఎందుకైనా మంచిదని వైరస్‌ సోకిన కుక్క పిల్లల యజమానులను కూడా పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. (చదవండి: అన్ని వైరస్‌ల కన్నా ప్రాణాంతకం ఇదే..)

చైనాలోని వుహాన్‌ మార్కెట్‌లో బయట పడిన అత్యంత ప్రమాదకర కోవిడ్‌-19 ఇంత వరకు కుక్కలకు, పిల్లులకు సోకినట్లు వార్తలు రాలేదు. పెంపుడు కుక్కల నుంచి యజమానులకుగానీ, యజమానుల నుంచి పెంపెడు కుక్కలకుగానీ ఈ వైరస్‌ సోకదని ‘యూసీ డేవిస్‌ స్కూల్‌ ఆఫ్‌ వెటర్నరీ మెడిసిన్‌’ ప్రొఫెసర్, పెంపుడు కుక్కలు, పిల్లులకు సోకే వ్యాధుల నిపుణుడైన డాక్టర్‌ నీల్స్‌ పెడర్సన్‌ ‘యూసీ డెవిస్‌ వెబ్‌సైట్‌’లో తెలియజేశారు. ఈ విషయమై హాంకాంగ్‌ వైద్యాధికారుల నుంచి వివరణ లేదు. (కోవిడ్‌ 19: ‘ఆ మాంసం తిని ఎవరూ చనిపోలేదు’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement