ఓనర్‌ ప్రాణాలు కాపాడిన సూపర్ డాగ్ ! | Sakshi
Sakshi News home page

ఓనర్‌ ప్రాణాలు కాపాడిన సూపర్ డాగ్ !

Published Wed, Dec 14 2016 6:44 PM

ఓనర్‌ ప్రాణాలు కాపాడిన సూపర్ డాగ్ ! - Sakshi

ఫిలడెల్ఫియా: విశ్వాసం అనే పదం వినగానే శునకం గుర్తొస్తుంది. ఎందుకుంటే వాటి యజమాని, వారి కుటుంబసభ్యులకు ఆపద తలెత్తితే అవి చురుకుగా స్పందిస్తాయన్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటన ఒకటి ఫిలడెల్ఫియాలో చోటుచేసుకుంది. అంధుడైన యజమానిని రక్షించి ఒక్కసారిగా ఓ శునకం హీరో అయింది.

ఫిలడెల్ఫియాకు చెందిన ఓ వ్యక్తి ఇంటికి ప్రమాదవశాత్తూ నిప్పంటుకుంది. అంధుడు, వృద్ధుడైన ఆ వ్యక్తి ఇంట్లో చిక్కుకుపోయాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు ఇంట్లో లేరు. విషయాన్ని గమనించిన అతడి పెంపుడు కుక్క యోలాండా వెంటనే స్పందించింది. ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసి మొరగటం ప్రారంభించింది. ఏదో జరిగి ఉంటుందని అనుమానం వచ్చిన ఫైర్ సిబ్బంది సమయానికి ఘటనా స్థలానికి చేరుకుని అంధుడైన యజమానిని రక్షించారు.

తన పెంపుడు శునకం తనను కాపాడటం ఇందో మూడోసారి అని ఓనర్ తెలిపాడు. 2013లో దొంగల బారినుంచి ఒకసారి, 2015లో టూర్‌కు వెళ్లగా స్పృహతప్పి పడిపోగా, అప్పుడు కూడా ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసి యజమాని ప్రాణాలు రక్షించింది. మరోసారి ఓనర్‌ను కాపాడి స్థానికులతో శభాష్ అనిపించుకుంది యోలాండా.

Advertisement
 
Advertisement
 
Advertisement