జోస్.. ఫొటోకు జోష్.. | Couple take stunning viral wedding photos on top of an Alaskan glacier | Sakshi
Sakshi News home page

జోస్.. ఫొటోకు జోష్..

Sep 9 2014 3:32 AM | Updated on Sep 2 2017 1:04 PM

జోస్.. ఫొటోకు జోష్..

జోస్.. ఫొటోకు జోష్..

ఈ ఫొటో గురించి చెప్పుకునే ముందు.. దీన్ని తీసిన ఫొటోగ్రాఫర్ జోస్ మార్టినేజ్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే.. సాహసంతో కూడిన ఈ చిత్రాలు తీయడమంటే మాటలా మరీ.

ఈ ఫొటో గురించి చెప్పుకునే ముందు.. దీన్ని తీసిన ఫొటోగ్రాఫర్ జోస్ మార్టినేజ్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే.. సాహసంతో కూడిన ఈ చిత్రాలు తీయడమంటే మాటలా మరీ. అదీ అలస్కాలోని హిమనీనదాల్లో.. తాను తీసే చిత్రాలు తన కస్టమర్స్ జీవితాల్లో మరిచిపోని అనుభూతిగా మిగిలిపోవాలన్నది జోస్ ఆశయం. దానికి నిదర్శనమే ఈ పెళ్లి చిత్రం. ఇటీవల క్నిక్ హిమనీనదం వద్ద ఇలాంటి అనేక చిత్రాలను తీశాడు. ఇందుకోసం ముందుగా హెలికాప్టర్ ఎక్కి.. ఫొటోలు తీయడానికి అనువైన ప్రదేశాలు ఎంచుకున్నాడు. తర్వాత పెళ్లికొడుకు, పెళ్లి కూతురిని తీసుకెళ్లి.. అద్భుత చిత్రాలను తీశాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement