గర్భదశలో మహిళ ఎక్కువ ఒత్తిడికి గురైతే దాని దుష్ప్రభావం పుట్టపోయే బిడ్డ మానసిక ఆరోగ్యంపై ఉంటుందట.
న్యూయార్క్: గర్భదశలో మహిళ ఎక్కువ ఒత్తిడికి గురైతే దాని దుష్ప్రభావం పుట్టపోయే బిడ్డ మానసిక ఆరోగ్యంపై ఉంటుందట. అలాంటి మహిళలకు జన్మించే వాళ్లు కూడా ఒత్తిడి, చదువులో వెనుకబడటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనంలో తేలింది. గర్భంతో ఉన్న ఎలుకలపై ఈ అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించామని అమెరికా నగరం ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.
ఒత్తిడికి గురైన ఎలుకల మావి, గుండె, పేగులవాహికల్లోని బ్యాక్టీరియా తీవ్ర మార్పులకు గురైనట్టు గుర్తించారు. వాటికి పుట్టిన పిల్లల్లోనూ ఇలాంటి మార్పులే కనిపించాయి. ఒత్తిడిని తగ్గించే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్‌ఎఫ్) అనే ప్రొటీన్ కూడా క్షీణించినట్టు గుర్తించారు.