పోల్‌ డ్యాన్స్‌తో వెల్‌కం చెప్పిన ప్రిన్సిపాల్‌

Chinese School Principal Welcoming Kids With Pole Dance - Sakshi

బీజింగ్‌ : ‘చదువు నేర్పమని పిల్లల్ని పాఠశాలకు పంపిస్తే మీరు ఇలాంటి వెర్రి మొర్రి వేషాలు వేస్తారా’ అంటూ తల్లిదండ్రులు చైనాలోని ఓ కిండర్ గార్టెన్ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడిపై మండిపడుతున్నారు. ఇంత ఆగ్రహం తెప్పించే పని ఏం చేశాడా అంటే సదరు ప్రిన్సిపాల్‌ స్కూల్‌లో జాయిన్‌ అవడానికి వచ్చిన పిల్లలకు పోల్‌ డ్యాన్స్‌తో ఆహ్వానం పలికాడు. దాంతో తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయునిపై మండి పడుతున్నారు.

వివరాల ప్రకారం.. షెన్జెన్ పట్టణానికి చెందిన ఓ దంపతులు తమ పిల్లాడిని కిండర్ గార్టెన్ స్కూల్‌లో జాయిన్‌ చేయాలని భావించారు. దాంతో తమకు సమీపంలో ఉన్న ఓ కిండర్ గార్టెన్ స్కూల్‌లో చేర్పించేందుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో వీరితో పాటు మరి కొందరు పిల్లలు కూడా కిండర్‌ గార్డెన్‌ స్కూల్‌లో జాయిన్‌ అవ్వడానికి వచ్చారు.  కొత్తగా వచ్చిన పిల్లలను ఘనంగా ఆహ్వానించడానికి సదరు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మహిళా డ్యాన్సర్‌తో పోల్‌ డ్యాన్స్‌ ఏర్పాటు చేశాడు. ఇది చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్యపోవడమే కాక ‘విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట ఇలాంటి పనికి మాలిన వేషాలు వేస్తావా’ అంటూ చివాట్లు పెట్టారు. దాంతో సదరు ప్రిన్సిపాల్‌ తన తప్పును క్షమించమంటూ పిల్లల తల్లిదండ్రులను కోరారు. ఈ పోల్‌ డ్యాన్స్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరలవుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top