విమానాశ్రయంలో 'వింత' భోజనప్రియుడు | Chinese man uses first-class air ticket to eat free meals | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో 'వింత' భోజనప్రియుడు

Feb 1 2014 9:59 AM | Updated on Aug 13 2018 3:35 PM

విమానాశ్రయంలో 'వింత' భోజనప్రియుడు - Sakshi

విమానాశ్రయంలో 'వింత' భోజనప్రియుడు

చైనాలోని ఒక వింత వ్యక్తి మాత్రం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్లో రాజపూజితంగా దొరికే ఉచిత భోజనం కోసమే టికెట్టు తీసుకున్నాడు.

బీజింగ్ : విమాన టికెట్టును ఎవరైనా విమానయానం కోసమే ఉపయోగిస్తుంటారు. టిక్కెట్టుతో సమకూరే అదనపు ఉచిత సౌకర్యాలేవైనా ఉంటే, ప్రయాణం వరకూ మాత్రమే వాటిని ఉపయోగిస్తారు. చైనాలోని ఒక వింత వ్యక్తి మాత్రం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్లో రాజపూజితంగా దొరికే ఉచిత భోజనం కోసమే టికెట్టు తీసుకున్నాడు.

టికెట్టును ఎప్పుడూ రద్దు చేసుకున్నా, డబ్బును పూర్తిగా వాపసు చేసే వెసులుబాటు కల్పించిన ఈస్టర్న్ చైనా ఎయిర్లైన్స్లో ఫస్ట్ క్లాస్ టికెట్టు కొని, దాంతో విమానంలో ప్రయాణించకుండా, ఎప్పటికప్పుడు ప్రయాణాన్ని రద్దు చేసుకుంటూ 300సార్లు అదే టికెట్టును రీబుకింగ్ చేసుకున్నాడు. షాంగ్లీ ప్రావిన్స్ జియాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిసారీ లాంజ్ సిబ్బందికి ఠీవిగా తన టికెట్టు చూపేవాడు.

లాంజ్లో చక్కర్లు కొడుతూ, టికెట్టుపై లభించే ఉచిత భోజనాన్ని సుష్టుగా ఆరగించేవాడు. తర్వాత టికెట్టును మరుసటి తేదీకి మార్చుకునేవాడు. ఏడాది వ్యవధిలో ఏకంగా 300 సార్లు ఉచిత భోజనాన్ని ఆస్వాదించాడు. విమానాశ్రయ సిబ్బంది అడ్డుకోవడంతో టికెట్టును రద్దు చేసుకుని, డబ్బును పూర్తిగా వాపసు తీసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement