ఆ కార్లనే తాకట్టు పెట్టాడు... | Chinese man jailed for mortgaging 23 rental cars | Sakshi
Sakshi News home page

ఆ కార్లనే తాకట్టు పెట్టాడు...

Feb 26 2016 3:33 PM | Updated on Aug 13 2018 3:35 PM

ఆ కార్లనే తాకట్టు పెట్టాడు... - Sakshi

ఆ కార్లనే తాకట్టు పెట్టాడు...

అద్దెకు తీసుకున్న కార్లనే తాకట్టు పెట్టాడు చైనాకు చెందిన ఓ ప్రబుద్ధుడు.

బీజింగ్: అద్దెకు తీసుకున్న కార్లనే తాకట్టు పెట్టాడు చైనాకు చెందిన ఓ ప్రబుద్ధుడు. వెన్‌జౌ నగరంలో నివసించే షీ(35) అనే వ్యక్తి అద్దెకు ఇచ్చే సంస్థలు, వ్యక్తుల నుంచి ఆడి, బిఎండబ్ల్యు, పోర్షే లాంటి ఖరీదైన కార్లను అద్దెకు తీసుకున్నాడు. 2014 మార్చి-సెప్టెంబరు మధ్య మొత్తం 23 కార్లను తాకట్టు పెట్టి రూ.6.5 కోట్ల రుణం తీసుకున్నాడు.

కోటి రూపాయలు విలువ చేసే ఆడి ఆర్8 కారుని రూ. 28 లక్షలకు అద్దెకు తీసుకుని రూ. 63 లక్షలకు తాకట్టు పెట్టాడు. గతేడాది జూన్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు అతడ్ని అరెస్టు చేశారు. కోర్టు అతనికి పన్నెండేళ్ల జైలు శిక్ష, రూ. 2.5 లక్షల జరిమానా విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement