కోవిడ్‌-19: చైనా కంపెనీ సరికొత్త రికార్డు! | Chinese Automaker BYD Company The Largest Producer Of Face Masks | Sakshi
Sakshi News home page

కోవిడ్‌-19: చైనా కంపెనీ సరికొత్త రికార్డు!

Mar 20 2020 12:51 PM | Updated on Mar 21 2020 8:09 AM

Chinese Automaker  BYD Company The Largest Producer Of Face Masks - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సాధించిందని తెలిపింది.

బీజింగ్‌: ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో చైనా విజయం సాధించింది. ముఖ్యంగా టెక్నాలజీ వాడకం, సత్వర వైద్య సదుపాయాలతోనే ఈ విజయం సాధ్యమైంది. ఇక వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో కీలక పాత్ర పోషించే మాస్కుల తయారీలో డ్రాగన్‌ దేశం ఆదర్శంగా నిలిచింది. వైరస్‌ విజృంభణతో మాస్కులకు భారీ డిమాండ్‌ ఏర్పడటంతో.. 20 రోజుల వ్యవధిలోనే 2.8 రెట్లు అధిక ఉత్పత్తితో.. చైనా రోజుకు 44.9 మిలియన్ల మాస్కులు తయారు చేసిందని నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిఫార్మ్‌ కమిషన్‌ ప్రశంసలు కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సాధించిందని తెలిపింది. ముఖ్యంగా షెంజెన్‌లో ఉన్న బీవైడీ కంపెనీ కృషి అభినందనీయమని పేర్కొంది. రోజుకు 5 మిలియన్ల మాస్కుల తయారీతో బీవైడీ అతిపెద్దగా సంస్థగా ఆవిర్భవించిందని తెలిపింది. దాంతోపాటు.. రోజూ మూడు లక్షల వైరస్‌ నిర్మూలనా ద్రావణం బాటిళ్లు తయారీ చేస్తోందని వెల్లడించింది.
(చదవండి: కరోనా అలర్ట్‌ : మాస్క్‌లు, గ్లోవ్స్‌ కంటే ఇదే ముఖ్యం)

మాస్కుల తయారీలో చైనాలో మూడో వంతు ఉత్పత్తిని బీవైడీ కంపెనీ సాధిస్తోందని నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిఫార్మ్‌ కమిషన్‌ చెప్పింది. డిమాండ్‌ అమాంతం పెరడంతో.. మూడు వేల మంది ఇంజనీర్లతో అందుబాటులో ఉన్న వనరుల సాయంతో రెండు వారాల్లోనే సామర్థ్యం పెంచుకోగలిగామని బీవైడీ కంపెనీ చైర్మన్‌, ప్రెసిడెంట్‌ వాంగ్‌ చౌన్‌ఫూ  చెప్పారు. ఇక కోవిడ్‌ పుట్టుకకు కేంద్రమైన చైనాలోని వుహాన్‌లో కొత్తగా వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులుగా అక్కడ పదుల సంఖ్యలోనే కేసులు నమోదవుతుండగా.. కోవిడ్‌తో మరణించే వారి సంఖ్య పడిపోయింది. అప్రమత్తంగా ఉంటే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని.. చైనా, దక్షిణ కొరియా, సింగపూర్‌ దేశాలు నిరూపించాయి. 
(చదవండి: కరోనా వ్యాప్తి: భారీగా వాల్‌మార్ట్‌ నియామకాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement