వైరల్‌ వీడియో.. పాఠశాలలో కరోనా మార్పులు

China Corona Changed Morning Routine In Schools - Sakshi

బీజింగ్‌: కరోనా.. కష్టాలతో పాటు మనిషి జీవితంలో మరేన్నో మార్పులు తీసుకువచ్చింది. కరోనా ఎఫెక్ట్‌తో ముఖ్యంగా మనందరికి వ్యక్తిగత పరిశుభ్రత బాగా అలవడింది. సామాజిక దూరం, మాస్కులు మన జీవితాల్లో భాగం కానున్నాయి. కరోనా కేవలం మన జీవన విధానాన్ని మాత్రమే కాక పని వేళలను, విధులను, చదువులను అన్నింటిని మార్చబోతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ మార్పులు ఆచరణలోకి వచ్చాయి. ప్రస్తుతం ఇలాంటి మార్పులకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతుంది.

ప్రపంచానికి కరోనాను పరిచయం చేసిన చైనాలో ప్రస్తుతం సాధరణ పరిస్థితులు నెలకొన్నట్లు ఆ దేశం ప్రకటించింది. కొన్ని నెలల తర్వాత తాజాగా చైనాలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇంతకు ముందు విద్యార్థులు జామ్మంటూ స్కూల్‌ లోపలకు పరిగెత్తుకెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా. అసలే కరోనా భయం.. ఈ మాయదారి రోగం తగ్గదు.. మన జాగ్రత్తలో మనం ఉండాలి అని భావించిన పాఠశాల యాజమాన్యాలు.. ఐదంచెల శుభ్రత వ్యవస్థను ప్రవేశపెట్టాయి.(వూహాన్‌లో అందరికీ పరీక్షలు)

దీంట్లో భాగంగా ఓ విద్యార్థి పాఠశాల గేటు వద్దకు రాగానే అక్కడి సిబ్బంది విద్యార్థి షూస్‌ను శానిటైజ్‌ చేస్తారు. అనంతరం స్టూడెంట్‌ తన మాస్క్‌ను అక్కడే ఉన్న చెత్తడబ్బాలో వేసి లోపలికి వెళ్లాలి. అక్కడ చేతులను శుభ్రం చేసుకోవాలి.తర్వాత విద్యార్థి బట్టలు, బ్యాగ్‌ను శానిటైజ్‌ చేస్తారు. తర్వాత మరో పరీక్ష చేసి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిస్తే అప్పుడు ఆ విద్యార్థిని పాఠశాలలోనికి అనుమతిస్తున్నారు. ఇంత తతంగం ముగిశాక పిల్లలు పాఠశాలలోనికి వెళ్తున్నారు. రెండు రోజుల క్రితం ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పటికే 7 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. మీరు ఓ సారి చూడండి...

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top