వూహాన్‌లో అందరికీ పరీక్షలు

Donald Trump Speaks About Covid 19 Tests In US - Sakshi

10 రోజుల్లో పూర్తికి ప్రణాళికలు

కోవిడ్‌ పరీక్షలు కోటి: ట్రంప్‌

వూహాన్‌/వాషింగ్టన్‌/లండన్‌: చైనాలోని వూహాన్‌లో నెల రోజుల తర్వాత మళ్లీ కరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో నివసిస్తున్న ప్రజలందరికీ కరోనానిర్ధారణ పరీక్షలు చేయనుంది. 1.1కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చైనా అధికారిక మీడియా తెలిపింది. 10 రోజుల్లోగా మొత్తం పరీక్షలుచేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.  పరీక్షల నిర్వహణపై సమగ్ర ప్రణాళిక తమకు ఇంకా అందలేదని ఝోన్‌గాన్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ పెంగ్‌ జియాంగ్‌ అన్నారు. అందరికీ పరీక్షల నిర్వహణ అంటే అత్యంత వ్యయంతో కూడుకున్నదని  కోవిడ్‌ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకి, వారితో కాంటాక్ట్‌ అయిన వారికి, మెడికల్‌ సిబ్బంది, వయసు మీద పడిన వారికి పరీక్షలు చేస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యాక్సిన్‌ వస్తుందో లేదో: బోరిస్‌ జాన్సన్‌ 
కోవిడ్‌ వ్యాధిపై పోరాటం చేసి కోలుకున్న బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఈ వైరస్‌ రావడానికి ఏడాదైనా పట్టొచ్చని, పూర్తిగా రాకపోవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ రాకపోయినా కోవిడ్‌తో పోరాటం చేయాలన్నారు.  బ్రిటన్‌ ఆర్థికంగా కోలుకోవాలంటే భౌతిక దూరం పాటిస్తూ దశలవారీగా ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. ‘వ్యాక్సిన్‌ రావడానికి ఏడాది పట్టొచ్చు. లేదంటే అసలు రాకపోనూవచ్చు. వ్యాక్సిన్‌ రాదు అన్న దానికి సిద్ధపడే లాక్‌డౌన్‌ ఎత్తివేస్తూ సాధారణ జనజీవనానికి రావాలన్నారు.

రోజూ మూడు లక్షల పరీక్షలు: ట్రంప్‌ 
అమెరికాలో కోవిడ్‌ పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెరిగిందని ఈ వారంలో దేశం కోటిమందికి పరీక్షల నిర్వహణ పూర్తి అవుతుందని అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. అమెరికా ఫుడ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ 92 ల్యాబరెటరీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు రోజుకి దాదాపు లక్షా 50 వేల పరీక్షలు నిర్వహించేది. ఇప్పుడు ప్రతీ రోజూ 3 లక్షలు నిర్వహిస్తోందని ట్రంప్‌ సోమవారం వెల్లడించారు. ఈ వారంలో కోటి మందికి పరీక్షలు పూర్తవుతాయని చెప్పారు. శ్వేత సౌధంలోకి వచ్చే ప్రతీ ఒక్కరూ మాస్క్‌ వేసుకోవడం తప్పనిసరి చేశారు.

మహిళా విలేకరితో ట్రంప్‌ వాదన 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మహిళా విలేకరిపై విరుచుకుపడి అర్ధంతరంగా సమావేశాన్ని ఆపి వెళ్లిపోయారు. సీబీఎస్‌ విలేకరి వీజే జియాంగ్‌ అడిగిన ప్రశ్నపై ట్రంప్‌ మండిపడ్డారు.  కరోనాతో వేలాది మంది మరణిస్తున్నా ప్రపంచంతో పోటీ పడేలా కరోనా పరీక్షలెందుకని ట్రంప్‌ను ఆమె ప్రశ్నించారు. దీనికి ఆగ్రహించిన ట్రంప్‌ కరోనాతో అమెరికాలో మాత్రమే కాక ప్రపంచ దేశాల్లో ఎందరో మరణిస్తున్నారని, ఈ ప్రశ్న అడగాల్సింది తనని కాదని, చైనాను అడగండని అన్నారు. జియాంగ్‌కు రెండేళ్ల వయసు ఉన్నపుడు ఆమె కుటుంబం చైనా నుంచి అమెరికాకి వలస వచ్చింది. చైనాను అడగాలని తనతోనే ఎందుకు అంటున్నారని జియాంగ్‌ ఎదురు ప్రశ్నించడంతో ట్రంప్‌ అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

05-07-2020
Jul 05, 2020, 04:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,000 దాటింది. ఆస్పత్రుల నుంచి శనివారం 376 మంది...
05-07-2020
Jul 05, 2020, 04:01 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 విధుల్లోకి మరో 948 మంది మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎమ్‌ఎల్‌హెచ్‌పీ)లు అందుబాటులోకి రానున్నారు. ఈ...
05-07-2020
Jul 05, 2020, 02:56 IST
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక్క వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ఇది అవసరమని భావిస్తోంది. నిజం...
05-07-2020
Jul 05, 2020, 02:43 IST
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో పదినెలల పసిపాపకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మండల వైద్యాధికారి...
05-07-2020
Jul 05, 2020, 02:33 IST
సాక్షి, హైదరాబాద్ ‌: వనస్థలిపురం ఏ క్వార్టర్స్‌లో ఉండే కిరాణా వ్యాపారి ఏప్రిల్‌లో తన కుమార్తె బర్త్‌డే వేడుకలు నిర్వహించగా,...
05-07-2020
Jul 05, 2020, 02:22 IST
ముంబై: కరోనా పంజా విసురుతుండగా, ప్రజాధనంతో కొత్త కార్లు కొనుక్కోవడానికి మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మహారాష్ట్రలో కలకలం...
05-07-2020
Jul 05, 2020, 02:17 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తూ కేంద్ర...
05-07-2020
Jul 05, 2020, 02:16 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రయాణాల ద్వారా ఒక నగరం...
05-07-2020
Jul 05, 2020, 02:11 IST
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో 33 గంటల లాక్‌ డౌన్‌ ప్రకటించింది. కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు...
05-07-2020
Jul 05, 2020, 02:11 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజృంభి స్తూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా మరో 1,850 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి....
05-07-2020
Jul 05, 2020, 01:42 IST
వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్‌ ధాటికి చిగురుటాకులా వణికిపోతోంది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది....
05-07-2020
Jul 05, 2020, 01:22 IST
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. పాజిటివ్‌ కేసుల విషయంలో పాత రికార్డులు చెదిరిపోతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం...
05-07-2020
Jul 05, 2020, 00:57 IST
న్యూఢిల్లీ: కరోనాని కట్టడి చేయడానికి వ్యాక్సిన్‌ రూపకల్పనలో భారత్‌ పురోగతి సాధించడంతో ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై పడింది. ఈ...
04-07-2020
Jul 04, 2020, 20:55 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో...
04-07-2020
Jul 04, 2020, 20:04 IST
పట్నా : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. వైరస్‌ ధాటికి సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు భయాందోళనకు గురవతున్నారు....
04-07-2020
Jul 04, 2020, 18:41 IST
లక్నో : ముఖానికి మాస్క్‌ పెట్టుకోవాలని చెప్పినందుకు పోలీసులపై ఓ బీజేపీ నేత విరుచుకుపడ్డారు. అధికార పార్టీకి చెందిన తనకే సూక్తులు...
04-07-2020
Jul 04, 2020, 17:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌ బయోటెక్‌ టీకా ప్రయత్నాలపై భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) శనివారం ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ స్థాయి...
04-07-2020
Jul 04, 2020, 17:27 IST
సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు...
04-07-2020
Jul 04, 2020, 15:39 IST
పుణె : కరోనా వైరస్‌ పుణ్యమా అని మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌ లోషన్లు నిత్య జీవితంలో భాగమయ్యాయి. మాస్క్‌ లేనిదే...
04-07-2020
Jul 04, 2020, 14:40 IST
సాక్షి, బెంగళూరు : సిలికాన్‌ సిటీ బెంగళూరును కరోనా మహమ్మారి చుట్టేస్తోంది. రాజధాని నలువైపులా కరోనా కేసులు నమోదవుతూ చక్రబంధంలోకి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top