కోడిగుడ్లతో కేన్సర్‌ మందులు | Cancer drugs with eggs | Sakshi
Sakshi News home page

కోడిగుడ్లతో కేన్సర్‌ మందులు

Oct 10 2017 4:04 AM | Updated on Jul 11 2019 5:40 PM

Cancer drugs with eggs - Sakshi

కోడిగుడ్లతో కేన్సర్‌కు మందులు కూడా తయారు చేయొచ్చు అంటున్నారు జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు. కోళ్ల జన్యువుల్లో కొన్ని మార్పులు చేసి వాటి గుడ్లలో ఇంటర్‌ ఫెరాన్‌ బీటా అనే రసాయనం తయారయ్యేలా చేశారు. దీన్ని హెపటైటిస్, కేన్సర్‌లతో పాటు మల్టిపుల్‌ స్కెలెరోసిస్‌ వంటి పలు వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. కొన్ని మైక్రోగ్రాముల ఇంటర్‌ ఫెరాన్‌ బీటా మందు ఖరీదు దాదాపు రూ.50 వేల వరకు ఉంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అడ్వాన్స్‌డ్‌ ఇండస్ట్రియల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్త యోమిరీ షిమ్‌బమ్‌ కోడి గుడ్ల ద్వారా ఈ మందును ఉత్పత్తి చేస్తున్నారు.

ప్రస్తుతం ఇంటర్‌ఫెరాన్‌ బీటా గుడ్లు పెట్టగల కోళ్లు మూడే ఉన్నాయి. వీటి గుడ్లను మరిన్ని పరిశోధనల కోసం ఫార్మా కంపెనీలకు విక్రయిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సామాన్యులకు ఈ మందు అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత కాలం పడుతుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement