బ్రెజిల్‌లో కాల్పులు | brezil firings 11 peoples killed | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌లో కాల్పులు

May 21 2019 4:26 AM | Updated on May 21 2019 4:26 AM

brezil firings 11 peoples killed - Sakshi

రియో డి జెనీరో: బ్రెజిల్‌లోని బెలామ్‌ నగరంలోని ఒక బార్‌లో ఆదివారం జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు.  కాల్పులు జరిపిన అనంతరం అగంతకులు పారిపోయారని తెలిసింది. అయితే దాడిచేసిన వారిలో ఒకరు గాయాలకు గురయ్యాడని, ప్రస్తుతం అతను తమ కస్టడీలో ఉన్నాడని పోలీసులు ప్రకటించినట్టుగా జీ–1 అనే వెబ్‌సైట్‌ తెలిపింది. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.  కారులో, బైక్‌పై వచ్చిన ఏడుగురు కాల్పులు జరిపారని, దాడి అనంతరం పరారయ్యారని పోలీసులు ప్రకటించారు. కాల్పులకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. కాల్పులు చోటు చేసుకున్న బార్, నేరాల అదుపునకు మార్చిలో ఏర్పాటుచేసిన ప్రత్యేక పోలీసు విభాగం కార్యాలయానికి అతి సమీపంలోనే ఉండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement