'కాల్చిపడేసి.. పిల్లల తలలు నరికి తీసికెళ్తాం' | Bomb threats across UK schools on GCSE exam day as caller vows to 'behead and shoot children' | Sakshi
Sakshi News home page

'కాల్చిపడేసి.. పిల్లల తలలు నరికి తీసికెళ్తాం'

May 23 2016 8:11 PM | Updated on Sep 4 2017 12:46 AM

'కాల్చిపడేసి.. పిల్లల తలలు నరికి తీసికెళ్తాం'

'కాల్చిపడేసి.. పిల్లల తలలు నరికి తీసికెళ్తాం'

బ్రిటన్లో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు వచ్చింది. స్కూళ్లు తెరవగానే అందులోని పిల్లలను కాల్చిపారేస్తామని.. వారి తలలు తీసుకెళతామని గుర్తు తెలియని వ్యక్తులు వరుస ఫోన్ కాల్స్ చేశారు.

లండన్: బ్రిటన్లో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు వచ్చింది. స్కూళ్లు తెరవగానే అందులోని పిల్లలను కాల్చిపారేస్తామని.. వారి తలలు తీసుకెళతామని గుర్తు తెలియని వ్యక్తులు వరుస ఫోన్ కాల్స్ చేశారు. ముఖ్యంగా వారు 19 స్కూళ్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అది కూడా అతిముఖ్యమైన జీసీఎస్ఈ పరీక్షలు జరగుతుండగా. దీంతో ఆ పరీక్షలు అప్పటికప్పుడు వాయిదా వేసి అందులోని విద్యార్థులందరిని హుటాహుటిన వారి వారి ఇళ్లకు తరలించారు.

ఓ పత్రికకు స్కూలు యాజమాన్యాలు ఏం చెప్పారంటే..'కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మాకు వరుస ఫోన్ కాల్స్ చేసి ఏం చెప్పారంటే.. విద్యార్థులపై కాల్పులు జరుపుతాం. వారి తలలు తీసుకొని వెళతాం' అని వరుస ఫోన్ కాల్స్ వచ్చినట్లు చెప్పారు. అయితే, 19 స్కూళ్లకు మాత్రమే ఈ బెదిరింపులు వచ్చినప్పటికీ.. పోలీసు అధికారులు మాత్రం దేశంలోని దాదాపు అన్ని పాఠశాలలు ముందు జాగ్రత్తగా మూసివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement