కారు.. ఎగిరింది సారు | Boeing company succeeded in designing an electric flying car model | Sakshi
Sakshi News home page

కారు.. ఎగిరింది సారు

Jan 25 2019 1:27 AM | Updated on Apr 4 2019 5:04 PM

Boeing company succeeded in designing an electric flying car model - Sakshi

ఇప్పటివరకూ ఎగిరే కారును డిజైన్లలోనే చూశాం.. ఇదిగో ఇప్పుడు నిజంగా చూసేయండి.. అమెరికాలోని వర్జీనియాలో ఈ ఎలక్ట్రిక్‌  ఫ్లయింగ్‌ కారు నమూనాను బోయింగ్‌ కంపెనీ విజయవంతంగా పరీక్షించింది. దీన్ని ‘పీఏవీ’ అని పిలుస్తున్నారు.

ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ సిస్టం ఆధారంగా ఇది నడుస్తుంది. ఒకేసారి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. రద్దీగా ఉండే పట్టణాలు, నగరాల్లో దీన్ని ఉపయోగించవచ్చని బోయింగ్‌ తెలిపింది. దీని పొడవు 30 అడుగులు, వెడల్పు 28 అడుగులు. తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ సక్సెస్‌ అయింది. అంటే.. ఈ కారు ఆకాశంలో జామ్మంటూ దూసుకుపోయే రోజు త్వరలోనే వచ్చేసినట్లే.. 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement