వారికే మొదట పరీక్షలు చేయాలి.

Bill Gates Reveals 3-Step Plan to Fight Global Coronavirus Crisis - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాతో సహా ప్రపంచదేశాలు కరోనా మహమ్మారి చేతిలో చిక్కుకొని విలవిలలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో కరోనా కట్టడికి మైక్రోసాఫ్ట్‌ కోఫౌండర్‌ బిల్‌గేట్స్‌ మూడు అంశాలను చెప్పారు. అందులో మొదటిది ప్రపంచదేశాల్లో అనుసరిస్తున్న లాక్‌డౌన్‌ను అమెరికాలో పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో బీచ్‌లకు ఇంకా జనం వెళుతున్నారని, రెస్టారెంట్లు ఇంకా తెరచే ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇలా సరిహద్దులు దాటి తిరిగితే వైరస్‌ విస్తరిస్తుందని తెలిపారు. లాక్‌డౌన్‌ను కచ్ఛితంగా ప్రతి ఒక్కరు పాటించేలా చూడాలని బిల్‌గేట్స్‌ అమెరికా నాయకులకు విజ్ఙప్తి చేశారు. కార్యకలాపాలు ఆపివేయకపోవడం వల్ల భవిష్యత్తుల్లో ఆర్ధిక సమస్యలు ఎదుర్కొవడమే కాకుండా వైరస్‌ వేగంగా విస్తరించే అవకాశం ఉందన్నారు. (కరోనా మహమ్మారిపై బిల్‌గేట్స్‌ స్పందన)

ఇక కరోనా టెస్ట్‌ల విషయానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఇదే విషయంలో న్యూయర్క్‌ నగరానికి సంబంధించి మాట్లాడుతూ.. నగరంలో ప్రతి రోజు 20వేల మందికి టెస్ట్‌లు చేస్తున్నారని తెలిపారు. స్వయంగా కరోనావైరస్‌ సోకిందా లేదో తెలుసుకోవడానికి సెల్ఫ్‌ స్వాబ్‌ పద్దతిని సీటెల్‌ కరోనావైరస్‌ అసెస్‌మెంట్‌ నెట్‌వర్క్‌ రూపొందించిందని తెలిపారు. దీంతో తమ శాంపిల్స్‌ను తామే పరీక్షించుకునే అవకాశం ఉందన్నారు.  

కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా టెస్ట్‌ల కోసం అధిక డిమాండ్‌ ఉందని పేర్కొన్న బిల్‌గేట్స్‌.. ప్రాధాన్యత క్రమంలో పరీక్షలు చేయాలని సూచించారు. ఈ క్రమంలో మొదట అత్యవసర సేవల్లో పనిచేస్తూ వైరస్‌ సోకడానికి అవకాశం ఎక్కువగా ఉన్న వారిని పరీక్షించాలని, ఆ తరువాత ఎవరైతే ఎక్కువ జబ్బుపడే ప్రదేశాల్లో ఉంటూ వైరస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వారిని అలా ప్రాధాన్యత క్రమంలో పరీక్షలు చేయాలని సూచించారు.  దీంతో పాటు ఇదే క్రమాన్ని మాస్క్‌లు, వెంటిలేటర్లు అందించే విషయంలో కూడా పాటించాలని ఆయన చెప్పారు. 

ఇంకా బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు వేత్తలు కరోనా వాక్సిన్‌ కోసం 24గంటలు శ్రమిస్తున్నారని అయితే దీనికి సంబంధించి అసత్య ప్రచారాలు జరగకుండా నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ మందులు కొనే విషయంలో అనవసర భయాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. వాక్సిన్‌ తయారికీ సంబంధించి ప్రయోగాలు చేస్తున్నామని, వేరు వేరు వ్యక్తులపై వాటిని పరీక్షిస్తున్నామని, సరైన ఫలితాలు రాగానే ఆ సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. అదేవిధంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే ఎవరికైతే దాని అవసరం ఎక్కువగా ఉందో వారికి అందిస్తామని తెలిపారు. 

హడావిడిలో ఏదో వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి బదులుగా మంచి ఫలితాలను ఇచ్చే వ్యాక్సిన్‌ను తయారు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ కనిపెడితే సగం యుద్దమే గెలిచినట్లు అవుతుందని.. అందరికి సరిపడేలా ఆ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చినప్పుడే పూర్తి యుద్దం గెలిచినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి ఇంకా 18 నెలల సమయం పడుతుందన్నారు. అయితే మంచి నిర్ణయాలు తీసుకొని, వైద్య నిపుణులు చెప్పినవి పాటిస్తే అమెరికా కొన్ని రోజుల్లో కొలుకుని యధాస్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న నమ్మకం తనకి ఉందని బిల్‌గేట్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాగా, అమెరికాలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య  మంగళవారం సాయంత్రం 3873కు చేరింది.  మంగళవారం ఒక్కరోజే 865 మంది మృత్యువాతపడడం గమనార్హం. ఇక ఇప్పటివరకు 188172 మందికి కరోనావైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 8 లక్షలు దాటగా... 40 వేల మందికి పైగా మరణించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

02-07-2020
Jul 02, 2020, 06:49 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షలు తొమ్మిది లక్షల మార్కును అధిగమించాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి...
01-07-2020
Jul 01, 2020, 19:36 IST
సాక్షి, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో క‌రోనా కేసులు వెలుగు చూడ‌టంతో న్యాయ‌స్థానం కీల‌క‌ నిర్ణ‌యం తీసుకుంది. కేవ‌లం అత్య‌వ‌స‌ర కేసులు మాత్ర‌మే...
01-07-2020
Jul 01, 2020, 15:30 IST
హైదరాబాద్‌: కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో టీవీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు నెలలుగా...
01-07-2020
Jul 01, 2020, 15:13 IST
వాష్టింగ్టన్ : క‌రోనా కల్లోలంతో విలవిల్లాడుతున్న అమెరికా కీలక  నిర్ణయం తీసుకుంది. అమెరికా ఔషధ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ కు చెందిన  రెమ్‌డిసివిర్ ఔష‌ధాన్ని...
01-07-2020
Jul 01, 2020, 14:51 IST
ల‌క్నో :  ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తూనే ఉంది. క‌రోనాకు సామాన్యులు, ప్ర‌ముఖులు అన్న తేడా లేదు. ఇప్ప‌టికే ఎంతోమంది...
01-07-2020
Jul 01, 2020, 14:11 IST
ముంబై: దేశంలో క‌రోనా ధాటికి అత‌లాకుత‌ల‌మ‌వుతున్న న‌గ‌రాల్లో ముంబై ముందు స్థానంలో ఉంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే నెల‌లో వినాయ‌క...
01-07-2020
Jul 01, 2020, 14:02 IST
సాక్షి,న్యూఢిల్లీ:  కరోనా నివారణకు పతంజలి ఆయుర్వేద ఔషధంలో మరో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. కోవిడ్-19 క్లినికల్ ట్రయల్‌కు సంబంధించిన అన్ని పత్రాలను...
01-07-2020
Jul 01, 2020, 11:21 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినా.....
01-07-2020
Jul 01, 2020, 10:55 IST
బ్రెసీలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సనారో పబ్లిక్‌ మీటింగు‌లలో తప్పక మాస్క్‌ ధరించాలంటూ అక్కడి కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే....
01-07-2020
Jul 01, 2020, 10:17 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభణ దేశంలో నానాటికీ పెరుగుతోంది. ఓవైపు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు...
01-07-2020
Jul 01, 2020, 09:46 IST
వాషింగ్టన్‌: ప్రపంచాన్ని కలవర పెడుతోన్న కరోనా వైరస్‌ అమెరికాలో తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం కరోనా కేసుల్లో అమెరికా ప్రపంచలోనే...
01-07-2020
Jul 01, 2020, 09:03 IST
వాషింగ్టన్ : కరోనా వైరస్  అమెరికాను వణికిస్తోంది. మరోవైపు భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే రోజుకు లక్ష కొత్త కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని...
01-07-2020
Jul 01, 2020, 08:56 IST
పెరుగుతున్న కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులతో జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. నగరవ్యాప్తంగా అన్ని...
01-07-2020
Jul 01, 2020, 08:07 IST
పారిస్‌: యూరోపియన్‌ యూనియన్‌ జూలై 1వ తేదీనుంచి 15 దేశాల సరిహద్దులను మళ్లీ తెరుస్తున్నట్లు ప్రకటించింది. అయితే కరోనా వైరస్‌...
01-07-2020
Jul 01, 2020, 05:30 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచినందున చాలామంది పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని మంత్రి ఈటల...
01-07-2020
Jul 01, 2020, 04:33 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. మంగళవారం కొత్తగా 18,522 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ...
01-07-2020
Jul 01, 2020, 04:28 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ టీకా అందరికీ అందుబాటులో, చవకగా లభించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టీకా...
01-07-2020
Jul 01, 2020, 02:31 IST
సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా పరీక్షలు 9 లక్షలకు చేరువయ్యాయి. మంగళవారం నాటికి 8.90 లక్షల పరీక్షలు పూర్తవ్వగా.. ఈ...
30-06-2020
Jun 30, 2020, 21:17 IST
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా కర్ణాటకలోని తుముకూరు జిల్లాలోని ఓ...
30-06-2020
Jun 30, 2020, 20:46 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా  945 కరోనా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top