ట్రంప్ దంపతులకు ఒబామా స్వాగతం | barack obama invites Donald Trump couple into white house | Sakshi
Sakshi News home page

ట్రంప్ దంపతులకు ఒబామా స్వాగతం

Jan 20 2017 9:49 PM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్ దంపతులకు ఒబామా స్వాగతం - Sakshi

ట్రంప్ దంపతులకు ఒబామా స్వాగతం

అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ తన సతీమణి మిలానియా ట్రంప్‌తో కలిసి వైట్‌ హౌస్‌కు వచ్చారు.

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ తన సతీమణి మిలానియా ట్రంప్‌తో కలిసి వైట్‌ హౌస్‌కు వచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. వాషింగ్టన్ లోని లింకన్ స్మారకంలో జరగనున్న ఈ వేడుకలకోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు.

మాజీ అధ్యక్షులు, సెనెటర్లు, సెలబ్రిటీలతో సహా దాదాపు తొమ్మిది లక్షల మంది ప్రజలు ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. గతేడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నేడు అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేయనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement