ఈ సోదరి కష్టం చూస్తే కన్నీరే.. | bangladesh sister’s story of breaking bricks to buy a bicycle for her brother | Sakshi
Sakshi News home page

ఈ సోదరి కష్టం చూస్తే కన్నీరే..

Jan 13 2018 12:31 PM | Updated on Oct 22 2018 6:05 PM

bangladesh sister’s story of breaking bricks to buy a bicycle for her brother - Sakshi

కూలీకి వెళ్తేకాని రోజు గడవని పరిస్థితి వారిది. అయినా ఉన్నదాంట్లో అందరూ సంతోషంగా ఉండేవారు. అయితే పెద్దలు చెప్పినట్లు మనం బాధల్లో ఉన్నప్పుడే కష్టాలు మరింతగా పలకరిస్తాయన్నట్లు, అలాంటి సమయంలోనే ఇంటికి పెద్ద దిక్కు రోడ్డు ప్రమాదంలో కన్ను మూశాడు. ఇక వారిపరిస్థతి అగమ్యగోచరం కొద్ది రోజులు పాటు తినడానికి తిండిలేదు. ఏదైనా కొనడానికి ఇంట్లో చిల్లిగవ్వలేదు. ఇక కుటుంబ భారాన్ని మోసే బాద్యతను 12ఏళ్ల చిన్నారి తీసుకుంది. బడికి వెళ్లాల్సిన వయసులో కొండంత కుటుంబ భారాన్ని మోస్తోంది. బలపంతో అక్షరాలు దిద్దాల్సిన చేతులు ఇటుకలను పగలకొడుతున్నాయి. తనవారి కోసం  బాల్యాన్ని త్యాగం చేసి కుటుంబం కోసం నిలబడింది ఓ చిన్నారి.

వివరాల్లోకి వెళ్తే బంగ్లాదేశ్‌కు చెందిన రోణా అక్తర్‌ 12 ఏళ్ల వయసులోనే కుటుంబ భారాన్ని మోస్తోంది. తండ్రి ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబాన్ని పోషించడానికి తల్లితో ఇటుకలను పగలకొట్టేపనికి చేరింది. ప్రారంభంలో రోజు 35 టాకాలు సంపాదించేది. ఇప్పడు రోజుకు 125 టాకాలు సంపాదిస్తోంది. తనకు వచ్చే ఈ చిన్న మొత్తం తోనే ఇంటి అద్దె, అవసరాలు తీరుస్తోంది. అంతేకాదు చదువులో రాణిస్తున్న తన సోదరుడు రాణాకు సైకిల్‌ కొనివ్వడం కోసం గత ఆరు నెలలుగా అదనంగా పనిచేస్తోంది. రాణా రోజు ట్యూషన్‌కు వెళ్లిరావడానికి ఇబ్బంది పడుతున్నాడని, తన సంపాదనతో సైకిల్‌ కొనివ్వాలన్నది తన కోరిక అక్తర్‌ అని తెలిపింది. బంగ్లాదేశ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆకాశ్‌  వీరి కష్టాన్నితన ఫేస్‌బుక్‌ వాల్‌పై రాసుకొచ్చాడు. దీంతో ఇది  సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement