ఫోర్డ్‌ కంపెనీ మాజీ ప్రెసిడెంట్‌ కన్నుమూత | Automaker Lee Iacocca Dies At 94 | Sakshi
Sakshi News home page

ఫోర్డ్‌ కంపెనీ మాజీ ప్రెసిడెంట్‌ కన్నుమూత

Jul 3 2019 9:23 AM | Updated on Jul 3 2019 10:04 AM

Automaker Lee Iacocca Dies At 94 - Sakshi

కాలిఫోర్నియో : ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ ఫోర్డ్‌ మోటార్స్‌ మాజీ ప్రెసిడెంట్‌ లీ ఐకాకా మంగళవారం కన్నుమూశారు. పార్కిన్‌సన్‌ వ్యాధితో గత కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆయన 94వ ఏట బెల్‌ ఏయిర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. లిడొ ఆంథోనీ ఐకాకా(లీ ఐకాకా) 1924లో పెన్సిల్వేనియాలోని అలైన్‌టౌన్‌లో ఇటాలియన్‌ దంపతులకు జన్మించారు. 1946లో ఫోర్డ్‌ మోటార్స్‌ కంపెనీలో ఇంజినీర్‌గా కెరీన్‌ను మొదలుపెట్టిన ఆయన ఆనతి కాలంలో ఫోర్డ్‌ కంపెనీ ప్రెసిడెంట్‌గా, క్రిస్లర్‌ కంపెనీ సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. ఆటో మొబైల్‌ రంగాన్ని ఐకాకా కొత్త పుంతలు తొక్కించారు. లీ ఐకాక నేతృత్వంలోనే ఫోర్డ్‌ ముస్టాంగ్‌, క్రిస్లర్‌ వ్యాన్‌లు రూపుదిద్దుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement