ఆస్ట్రేలియా వెళ్లడం అంత ఈజీ కాదు... | Australia to tighten immigration laws | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా వెళ్లడం అంత ఈజీ కాదు...

Feb 23 2015 8:50 AM | Updated on Jun 4 2019 6:31 PM

ఆస్ట్రేలియా వెళ్లడం అంత ఈజీ కాదు... - Sakshi

ఆస్ట్రేలియా వెళ్లడం అంత ఈజీ కాదు...

ఆస్ట్రేలియాలో వలస చట్టాలు కఠినం కానున్నాయి. పలు ఉగ్రవాద సంస్థలను కట్టడి చేసేందుకు తమ వద్ద ఇప్పటికే ఉన్నఇమ్మిగ్రేషన్ చట్టాలను మార్చనున్నారు.

ఆస్ట్రేలియాలో వలస చట్టాలు మరింత కఠినతరం కానున్నాయి. పలు ఉగ్రవాద సంస్థలను కట్టడి చేసేందుకు తమ వద్ద ఇప్పటికే ఉన్నఇమ్మిగ్రేషన్ చట్టాలను ఆ దేశం మార్చబోతోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వెల్లడించారు. దేశం తీసుకునే వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా, దేశ ప్రజల రక్షణ చర్యల్లో భాగంగా ఉగ్రవాద నిరోధక చర్యలకై వలసల చట్టాల విషయంలో ముందుకు వెళుతున్నట్లు ఆయన ప్రకటించారు.

 

ముఖ్యంగా గత డిసెంబర్లో జరిగిన సిడ్నీ కేఫ్ సంఘటన నేపథ్యంలో సమీక్షలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చినట్లు టోనీ అబాట్ వెల్లడించారు. సిడ్నీ కేఫ్లోకి ముగ్గురు తీవ్రవాదులు ప్రవేశించి 16 మందిని బందీలుగా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement